కన్నుల పండువగా కనకదుర్గమ్మ తీర్థం
ABN , Publish Date - Jan 16 , 2025 | 11:47 PM
కొటారుబిల్లి కనకదుర్గమ్మ తీర్థ మహోత్సవాన్ని గురు వారం సాయంత్రం కన్నుల పండువగా నిర్వహించారు.

గంట్యాడ, జనవరి 16 (ఆంధ్రజ్యోతి): కొటారుబిల్లి కనకదుర్గమ్మ తీర్థ మహోత్సవాన్ని గురు వారం సాయంత్రం కన్నుల పండువగా నిర్వహించారు. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకూ అమ్మవారిని దర్శించుకోవడానికి భక్తులు క్యూ కట్టారు. ఆలయ పూజారులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం భక్తులు పసుపు, కుంకుమలతో మొక్కులు చెల్లించుకున్నారు. సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 8 వరకూ తీర్థ మహోత్సవం సాగింది. ఈ సందర్భంగా సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. విజయనగరం రూరల్ సీఐ లక్ష్మణరావు ఆధ్వ ర్యంలో బందోబస్తు నిర్వహించారు. ఎస్‌ఐ సాయి కృష్ణ, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.