జన్‌మాన్ పనుల వివరాలను అప్‌లోడ్ చేయాలి
ABN , Publish Date - Jan 17 , 2025 | 11:46 PM
జన్ మాన్ పనుల వివరాలను ఎప్పటికప్పుడు అప్‌లోడ్ చేయాలని కలెక్టర్ ఎ.శ్యాంప్రసాద్ ఆదేశించారు.

బెలగాం, జనవరి 17 (ఆంధ్రజ్యోతి): జన్ మాన్ పనుల వివరాలను ఎప్పటికప్పుడు అప్‌లోడ్ చేయాలని కలెక్టర్ ఎ.శ్యాంప్రసాద్ ఆదేశించారు. జన్ మాన్ కార్యక్రమంపై శుక్రవారం స్థానిక కలెక్టర్ కార్యాలయంలో సంబంఽధిత అధికారులతో ఆయన సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ గ్రామీణ నీటి సరఫరా అధికారులు జలజీవన్ మిషన్ కింద నీటిని సరఫరా చేసేందుకు అవసరమైన చర్యలు చేపట్టాలని, వాటిని సంబంధిత పోర్టల్‌లో అప్లోడ్ చేయాలని ఆయన ఆదేశించారు. గృహ నిర్మాణాలను వేగవంతం చేయాలని, డేటాలో వచ్చే సాంకేతిక సమస్యలను అధిగమించాలని అన్నారు. మెరుగైన వైద్యం పేదలకు అందాలన్నారు. ఈ కార్యక్రమంలో పార్వతీపురం ఐటీడీఏ పీవో, సబ్ కలెక్టర్ అశుతోష్ శ్రీవాస్తవ, సీతంపేట ఐటీడీఏ పీవో యశ్వంత్‌కుమార్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.