Share News

పెదబొండపల్లి భూములపై దర్యాప్తు

ABN , Publish Date - Feb 08 , 2025 | 12:05 AM

మండలంలోని పెద బొండపల్లి గ్రామానికి చెందిన దళితులు తమ భూములను చుక్క శ్రీదేవి అనే మహిళ ఆక్రమించుకున్నారని రూరల్‌ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదుపై ఏఎస్పీ అంకిత సురాన శుక్రవారం దర్యాప్తు నిర్వహించారు.

పెదబొండపల్లి భూములపై దర్యాప్తు

పార్వతీపురం రూరల్‌, ఫిబ్రవరి 7 (ఆంధ్రజ్యోతి): మండలంలోని పెద బొండపల్లి గ్రామానికి చెందిన దళితులు తమ భూములను చుక్క శ్రీదేవి అనే మహిళ ఆక్రమించుకున్నారని రూరల్‌ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదుపై ఏఎస్పీ అంకిత సురాన శుక్రవారం దర్యాప్తు నిర్వహించారు. ఫిర్యాదుదా రుల నుంచి వివరాలు సేకరించారు. పెదబొండపల్లి గ్రామంలో దశాబ్దాల కిందట దళితులకు కేటాయించిన భూములు ప్రస్తుత వారి ఆధీనంలో లేకపోవడం, తమ భూములను ఆక్రమణలకు గురయ్యాయని, ఆక్రమణలు చేసిన వారిపై ఎస్సీ, ఎస్టీ కేసు నమోదు చేయాలని డిమాండ్‌ చేస్తూ ఇటీ వల కలెక్టర్‌ కార్యాలయం వద్ద పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించారు. దళితు లకు మద్దతుగా ఎమ్మెల్యే విజయచంద్ర తోపాటు టీడీపీ కార్యకర్తలు అండ గా ఉంటూ దళితులకు న్యాయం చేయాలని డిమాండ్‌ చేస్తున్నారు. ఈనేప థ్యంలో దళితుల ఫిర్యాదు మేరకు పోలీసులు దర్యాప్తు నిర్వహిస్తున్నారు.

Updated Date - Feb 08 , 2025 | 12:05 AM