Share News

గర్భిణులపై నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవు

ABN , Publish Date - Feb 12 , 2025 | 12:01 AM

గర్భిణుల ఆరోగ్యంపై సిబ్బంది నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ ప్రోగ్రాం అధికారి తెర్లి జగన్మోహనరావు అన్నారు.

గర్భిణులపై నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవు
గర్భిణులతో మాట్లాడుతున్న జగన్మోహనరావు

గరుగుబిల్లి, ఫిబ్రవరి 11 (ఆంధ్రజ్యోతి): గర్భిణుల ఆరోగ్యంపై సిబ్బంది నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ ప్రోగ్రాం అధికారి తెర్లి జగన్మోహనరావు అన్నారు. గరుగుబిల్లి పీహెచ్‌సీని ఆయన మంగళవారం సందర్శించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ గర్భిణుల సుఖ ప్రసవమే ధ్యేయంగా మెరుగైన సేవలందించాలని సిబ్బం దికి సూచించారు. ఆరోగ్య కేంద్రాల పరిధిలో ప్రసవాలు అధికంగా జరిగేలా దృష్టి సారించాల న్నారు. హైరిస్క్‌ ఉన్న వారిని గుర్తించి ప్రత్యేక పర్యవేక్షణ చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో వైద్యులు క్రాంతి కిరణ్మయి, ఎస్‌.సంతోష్‌కుమార్‌, డీపీహెచ్‌ఎంవో కె.ఉషారాణి, డీసీఎం డి.విజయలత, ఎకడమిక్‌ ఈవో సత్తిబాబు, సూపర్‌వైజర్లు పాల్గొన్నారు.

అప్రమత్తంగా ఉండాలి

బలిజిపేట, ఫిబ్రవరి 11(ఆంధ్రజ్యోతి): వైద్య సిబ్బంది గర్భిణుల పట్ల చాలా అప్రమత్తంగా ఉండాలని జిల్లా ఇమ్యునైజేషన్‌ అధికారి టి.జగన్మోహనరావు తెలిపారు. బలిజిపేట పీహెచ్‌సీలో మంగళవారం నిర్వహించిన ప్రధానమంత్రి సురక్ష మాతృత్వ అభియాన్‌ కార్యక్రమాన్ని ఆయన పరిశీలించారు. రక్తపరీక్ష ద్వారా హిమోగ్లోబిన్‌ శాతాన్ని తెలుసుకుని అవసరమైన చికిత్స అందిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏపిడిమిక్‌ ఎంపీహెచ్‌ఈవో సత్తిబాబు, డీపీహెచ్‌ఎస్‌ విజయలత, డీపీవో ఉషారాణి, వైద్యాధికారిణి క్రాంతికిరణ్‌మై, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.

Updated Date - Feb 12 , 2025 | 12:02 AM