Share News

ఒక్క ఇటుక పడితే ఒట్టు

ABN , Publish Date - Jan 16 , 2025 | 11:54 PM

గత వైసీపీ ప్రభుత్వ నిర్వాకంతో గిరిజన విశ్వవిద్యాలయ నిర్మాణానికి ఇప్పటికీ పునాది రాయి కూడా పడలేదు.

ఒక్క ఇటుక పడితే ఒట్టు
కేంద్రీయ గిరిజన విశ్వ విద్యాలయానికి మెంటాడ వద్ద సేకరించిన భూములు

గత వైసీపీ ప్రభుత్వ నిర్వాకంతో గిరిజన విశ్వవిద్యాలయ నిర్మాణానికి ఇప్పటికీ పునాది రాయి కూడా పడలేదు. పైగా కొత్త చిక్కులు తెచ్చిపెట్టింది. తరచూ కేంద్ర ప్రభుత్వ ఆమోదం కోసం రాష్ట్ర ప్రభుత్వం వేడుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. వైసీపీకి ముందు టీడీపీ ప్రభుత్వం సేకరించిన స్థలంలో గిరిజన విశ్వ విద్యాలయానికి పూనుకుని ఉంటే ఈ పాటికే విద్యార్థులకు సొంతగూడు దొరికేది. పరాయి పంచన చదుకోవాల్సిన దుస్థితి తప్పేది. కానీ జగన్‌ సర్కారు తీసుకున్న తప్పుడు నిర్ణయంతో గిరిజన విద్యార్థులకు తీవ్ర నష్టం జరిగింది. ఇప్పుడు భవన నిర్మాణాల అంచనా వ్యయం విపరీతంగా పెరిగి కూటమి ప్రభుత్వానికి ఆర్థిక భారంగా మారింది.
శృంగవరపుకోట, జనవరి 16 (ఆంధ్రజ్యోతి)
ఫ గత టీడీపీ ప్రభుత్వ హయాంలో కేంద్రీయ గిరిజన విశ్వ విద్యాలయ నిర్మా ణం కోసం కొత్తవలస మండలం రెల్లి గ్రా మ పరిధిలో 526.91 ఎకరాలను సేకరించా రు. గిరిజనుల ఆక్రమణలో ఉన్న ఈ భూ ములను సేకరించేందుకు అప్పటి పాలకు లు, అధికారులు తీవ్ర ఇబ్బందులు పడ్డా రు. గిరిజనులను ఒప్పించేందుకు అప్పటి, ఇప్పటి శృంగవరపుకోట శాసన సభ్యురాలు కోళ్ల లలిత కుమారి తీవ్రంగా శ్రమించారు. సేకరించిన భూమి చుట్టూ ప్రహరీ నిర్మించి 2019లో పనులకు శంకుస్థాపన చేశారు.
-వైసీపీ ప్రభుత్వం వచ్చిన తరువాత ఈ విశ్వవిద్యాలయం నిర్మాణానికి మళ్లీ భూ సేకరణ చేపట్టింది. మెంటాడ, దత్తిరా జేరు మండలాల మధ్య 561.91 ఎకరాల సేకరణకు పూనుకుంది. అనేక వివాదాలు చుట్టుముట్టడంతో పూర్తి స్థాయిలో స్థల సేకరణ చేయకుండానే 2023 ఆగస్టు 25న అప్పటి కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌తో పనులకు శంకుస్థాపన చేయించారు. అంతే ఆ తరువాత దాని ఊసే మరిచారు.
రాష్ట్ర విభజన చట్టంలో భాగంగా పదేళ్ల కిందట కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి గిరిజన విశ్వ విద్యాలయాన్ని కేటాయించింది. ఈ విశ్వవిద్యాలయాన్ని విజయనగరం జిల్లాలో ఏర్పాటు చేయాలని అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు నిర్ణయించారు. దీని కోసం కొత్తవలస మండలం రెల్లిలో 526.91 ఎకరాలను సేకరించారు. దీనికి కేంద్ర కమిటీ ఆమోద ముద్ర వేసింది. 2019లో పనులకు శంకుస్థాపన చేశారు. ఇంతలో ప్రభుత్వం మారింది. వైసీపీ అధికారంలోకి వచ్చింది. అంతే, టీడీపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలను వెనక్కినెట్టారు. ఇందులో భాగంగా రెల్లిలో గిరిజన యూనివర్సిటీ కోసం కేటాయించిన భూములను పక్కన పెట్టేశారు. మెంటాడ, దత్తిరాజేరు మండలాల మధ్యలో మళ్లీ భూసేకరణ చేపట్టారు. ఈ రెండు మండ లాల పరిధిలోని చినమేడపల్లి, మర్రివలస గ్రామాల వద్ద 561.91 ఎకరాలు కేటా యించారు. 2023 ఆగస్టు 25న అప్పటి కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌తో పనుల కు శంకుస్థాపన చేయించారు. ఇదిగో కట్టే స్తున్నాం.. అదిగో నిర్మించేస్తున్నాం అంటూ ప్రకటనలతో కాలయాపన చేసేశారు. అందుబాటులో ఉన్న భూమిని వదిలేసి కొత్తగా భూసేకరణకు దిగడంతో ఐదేళ్లు కాలం కరిగిపోయింది. అయినా సేకరించిన భూముల్లో ఒక్క ఇటుక కూడా వేయలేదు. సొంత భవనం లేకపోవడంతో కొండకర కాం వద్ద ఉన్న ఆంధ్ర విశ్వవిద్యాలయ పీజీ సెంటర్‌లో గిరిజన యూనివర్సిటీ విద్యార్థులకు తరగతులు నిర్వహిస్తున్నారు.
పెరుగుతున్న అంచనా వ్యయం..
గిరిజన యూనివర్సిటీ నిర్మాణంలో జాప్యం జరుగుతుండడంతో ఏడాదికేడాదీ అంచనా వ్యయం పెరుగుతోంది. తొలుత యూనివర్సిటీ శాశ్వత భవన నిర్మాణాలకు రూ.525.08 కోట్లు ఖర్చువుతుందని అంచనా వేశారు. అయితే, స్థల సేకరణ జాప్యం కారణంగా నిర్మాణ వ్యయం రూ.834 కోట్లకు పెరిగింది. తాజాగా, రూ.1000 కోట్లకు పైబడి ఖర్చువుతుందని అధికారులు అంటున్నారు. ఈ భారం కూటమి ప్రభుత్వంపై పడనుంది. అయితే, ఎలాగైనా భవన నిర్మాణాలను పూర్తి చేయాలనే పట్టుదలతోఉంది. మెంటాడ, దత్తిరాజేరు మండలాల పరిధిలో సేకరిం చిన భూముల్లో భవనాలను నిర్మించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నా యి. పనులు వేగవంతం చేయాలని నాలుగు నెలల కిందట కేంద్ర ప్రభుత్వ ఉన్న తాధికారులు వీడియోకాన్ఫరెన్స్‌లో రాష్ట్ర ప్రభుత్వ అధికారులను ఆదేశించా రు. దీంతో కలెక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌.. యూనివర్సిటీ అప్రోచ్‌ రోడ్డు కోసం 12 ఎకరాలు గుర్తించారు.ఇప్పటికే 7 ఎకరాలు అప్పగించారు. రెల్లి వద్ద సేకరించిన భూములను గ్రేహౌండ్స్‌ విభాగానికి అప్పగించేందుకు ప్రభుత్వం నిర్ణయించినట్లు సమాచారం.

Updated Date - Jan 16 , 2025 | 11:54 PM