Share News

palm oil : పామాయిల్‌ తోటలతో అధిక లాభాలు

ABN , Publish Date - Jan 31 , 2025 | 12:07 AM

palm oil : పామాయిల్‌ తోటల పెంపకంతో గిరిజన రైతులకు అధికలాభాలు వస్తాయని సీతంపేట ఐటీడీఏ ఇన్‌చార్జి పీవో సి.యశ్వంత్‌కుమార్‌రెడ్డి అన్నారు.

 palm oil : పామాయిల్‌ తోటలతో అధిక లాభాలు
ఆశ్రమ పాఠశాలలో వంటకాలను రుచిచూస్తున్న ఇన్‌చార్జి పీవో యశ్వంత్‌కుమార్‌రెడ్డి

సీతంపేట రూరల్‌, జనవరి 30(ఆంధ్రజ్యోతి): పామాయిల్‌ తోటల పెంపకంతో గిరిజన రైతులకు అధికలాభాలు వస్తాయని సీతంపేట ఐటీడీఏ ఇన్‌చార్జి పీవో సి.యశ్వంత్‌కుమార్‌రెడ్డి అన్నారు. చినబగ్గ గ్రామంలోని పామాయిల్‌ ప్లాంటేషన్‌ను ఆయన గురువారం పరిశీలించారు. శతశాతం సబ్సిడీతో పామాయిల్‌ మొక్కలను రైతులకు పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. గ్రామంలోని అంగన్‌వాడీ కేంద్రాన్ని పరిశీలించి చిన్నారులతో ముచ్చటించారు. చిన్నారులకు ఆట, పాటలతో కూడిన విద్యను అందించాలని టీచర్‌కు సూచించారు. అనంతరం మర్రిపాడు పీహెచ్‌సీ, ఏఎన్‌ఎం సబ్‌సెంటర్‌, పూతికవలస గిరిజన సంక్షేమ ఆశ్రమ బాలికల పాఠశాలను సందర్శించారు. పీహెచ్‌సీలో అన్ని మందులు అందుబాటులో ఉంచుకోవాలని వైద్యాధికారులను ఆదేశించారు. విద్యార్థినులకు మెరుగైన విద్యను అందించాలని, ఉత్తీర్ణత శాతం పెంచాలని ఉపాధ్యాయులకు సూచించారు. విద్యార్థులకు మెనూ ప్రకారం భోజనం పెట్టాలని అన్నారు. చదువులో వెనుకబడిన విద్యార్థినులకు ప్రత్యేక తరగతులు నిర్వహించాలని హెచ్‌ఎం శారదను ఆదేశించారు. పాఠశాలలో నెలకొన్న భవనాల సమస్యను పరిష్కరిస్తామని తెలిపారు. దీనికి ముందు పాత పనుకువలసలో ఎంఎస్‌ఎంఈ పార్క్‌ కోసం గుర్తించిన స్థలాన్ని పీవో పరిశీలించారు. ఆయన వెంట పీహెచ్‌వో వెంకటగణేష్‌, హెచ్‌వోలు ఉన్నారు.

అర్హులైన లబ్ధిదారులను ఎంపిక చేయండి

సీతంపేట ఐటీడీఏ ద్వారా అందించే పథకాల కోసం అర్హులైన లబ్ధిదారులను ఎంపిక చేయాలని ఇన్‌చార్జి పీవో యశ్వంత్‌కుమార్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. గురువారం ఐటీడీఏ కార్యాలయంలో అధికారులతో సమీక్ష నిర్వహించారు. సీసీడీపీ, ఎస్‌సీఏ టు టీఎస్‌పీ కింద మంజూరైన పథకాలకు పూర్తిగా అర్హులైన లబ్ధిదారులను మాత్రమే ఎంపిక చేయాలని స్పష్టం చేశారు. గతంలో వీరు ఎటువంటి జీవనోపాధి పథకాలు పొంది ఉండకూడదన్నారు. పీజీఆర్‌ఎస్‌కు వినతులు అందించిన వారికి అధిక ప్రాధాన్యత ఇవ్వాలని అన్నారు. ఈ సమీక్షలో ఏపీవో జి.చిన్నబాబు, వెలుగు ఏపీడీ సన్యాసిరావు, ఇతర శాఖల అధికారులు పాల్గొన్నారు.

Updated Date - Jan 31 , 2025 | 12:07 AM