road accident రోడ్డు ప్రమాదంలో హెడ్ కానిస్టేబుల్ మృతి
ABN , Publish Date - Jan 09 , 2025 | 12:46 AM
కొండతామరాపల్లి కూడలి వద్ద బుధవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో హెడ్ కానిస్టేబుల్ దుర్మరణం చెందగా, మరో కానిస్టేబుల్ కు తీవ్ర గాయాలయ్యాయి.
మరో కానిస్టేబుల్‌కు తీవ్ర గాయాలు
గంట్యాడ, జనవరి 8 (ఆంధ్రజ్యోతి): కొండతామరాపల్లి కూడలి వద్ద బుధవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో హెడ్ కానిస్టేబుల్ దుర్మరణం చెందగా, మరో కానిస్టేబుల్ కు తీవ్ర గాయాలయ్యాయి. ఇందుకు సంబంధించి గం ట్యాడ ఎస్‌ఐ సాయికృష్ణ అందించిన వివరాలు ఇలా ఉన్నాయి. విజయనగరంలో నివాసం ఉంటున్న హెడ్ కానిస్టేబుల్ ఎన్.వి.రమణ (50) అనంతగిరి పోలీసు స్టేషన్‌లో విధులు ముగించుకుని బుధవారం మధ్యాహ్నం ద్విచక్ర వాహనంపై ఇంటికి వస్తున్నారు. కొండతామరాపల్లి కూడలి వద్దకు వచ్చేసరికి... విజ యనగరం నుంచి అనంతగిరి పోలీసుస్టేషన్‌లో డ్యూటీకి ద్విచక్ర వాహనంపై వెళ్తున్న గురునాథ్‌రెడ్డి.. హెచ్‌సీని ఢీ కొన్నారు. దాంతో రమణ అక్కడిక్కడే మృతి చెందారు. గురునాథ్‌రెడ్డి తీవ్రంగా గాయపడటంతో విజయనగరం ఆసు పత్రికి తరలించారు. ఏపీఎస్‌పీ డీఎస్పీ లక్ష్మినారాయణ, విజయనగరం రూర ల్ సీఐ లక్ష్మణరావు, గంట్యాడ ఎస్‌ఐ ఘటనా స్థలానికి వెళ్లి పరిస్థితిని పరిశీ లించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేశారు.