హామీలను అమలు చేయాలి
ABN , Publish Date - Feb 16 , 2025 | 11:22 PM
అంగన్‌వాడీలకు కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయలని ఏపీ అంగన్‌వాడీ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.సుబ్బరావమ్మ డిమాండ్ చేశారు.
బెలగాం, ఫిబ్రవరి 16 (ఆంధ్రజ్యోతి): అంగన్‌వాడీలకు కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయలని ఏపీ అంగన్‌వాడీ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.సుబ్బరావమ్మ డిమాండ్ చేశారు. ఆదివారం పార్వతీపురంలో విలేకరులతో మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వ హయాంలో 42 రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా అంగన్‌వాడీలు సమ్మె చేశారని, దీంతో అప్పటి ప్రభుత్వం జూలైలో వేతనాలు పెంచుతామని, డిమాండ్లను పరిష్కరిస్తామని మినిట్స్ కాపీ ఆధారంగా హామీఇచ్చినట్లు చెప్పారు. కూటమి ప్రభు త్వం ఏర్పడిన అనంతరం మినిట్స్ కాపీ అమలు చేయాలని పలు సార్లు మంత్రులు, అధికారులను వేడుకున్నట్లు తెలిపారు. హామీలు నెరవేర్చాలని సోమవారం అంగన్‌వాడీ ప్రాజెక్టు కార్యాలయాల వద్ద నిర్వహించనున్న ధర్నా జయపద్రం చేయాలని కోరారు. కార్యక్ర మంలో సీపీఎం నాయకులు పాల్గొన్నారు.