Share News

నారాయణపురం నేత చీరలకు భౌగోళిక గుర్తింపు

ABN , Publish Date - Feb 14 , 2025 | 12:23 AM

మండలంలోని నారాయణపురంలో తయా రవుతున్న నేత చీరలకు భౌగోళిక గుర్తింపు లభించినట్టు జియోగ్రాఫికల్‌ ఇండికేషన్‌ హైదరాబాద్‌ లీగల్‌ కౌన్సిల్‌ శ్రీవత్స తెలి పారు.

నారాయణపురం నేత చీరలకు భౌగోళిక గుర్తింపు
నేత చీరలను పరిశీలిస్తున్న హైదరాబాద్‌ బృందం

బలిజిపేట, ఫిబ్రవరి 13 (ఆంధ్రజ్యోతి): మండలంలోని నారాయణపురంలో తయా రవుతున్న నేత చీరలకు భౌగోళిక గుర్తింపు లభించినట్టు జియోగ్రాఫికల్‌ ఇండికేషన్‌ హైదరాబాద్‌ లీగల్‌ కౌన్సిల్‌ శ్రీవత్స తెలి పారు. ఆయన గురువారం పార్వతీపురం జిల్లా బలిజిపేట మండలం నారాయణపు రంలో చేనేత కార్మికులు తయారు చేస్తున్న 100 కౌంట్‌ చీరలను తన బృందంతో పరి శీలించారు. నారాయణపురంలో తయారైన 100 కౌంట్‌ చీరలు దేశంలో మరెక్కడా త యారు కావడం లేదని స్పష్టం చేశారు. నారాయణపురం చేనేత కార్మికులు తయారు చేసే వంద రకాల చీరలకు దేశంలోని అనేక ప్రాంతాల్లో మంచి గుర్తింపు ఉందన్నారు. ఇక్కడి నూరు కౌంటు నేత చీరలకు జియో గ్రాఫికల్‌ ఇండికేషన్‌ కోసం చేనేత కార్మికు లు దరఖాస్తు చేసుకోగా వీరికి భౌగోళిక గు ర్తింపు లభించినట్టు తెలిపారు. దీనిపై చేనే త కార్మికులు హర్షం వ్యక్తం చేశారు. హ్యాం డ్లూమ్‌ అండ్‌ టెక్స్‌టైల్స్‌ ఏపీడీ జనార్దన రావు, అసిస్టెంట్‌ డెవలప్‌మెంట్‌ ఆఫీసర్‌ వెంకటరమణ, డిజైనర్‌ ప్రసాద్‌, కార్మికులు వీర్రాజు, నీలకంఠం, వెంకటరావు పాల్గొన్నారు.

Updated Date - Feb 14 , 2025 | 12:23 AM