Share News

ఎన్నికల హామీలను నెరవేర్చండి

ABN , Publish Date - Jan 25 , 2025 | 11:51 PM

ss

  ఎన్నికల హామీలను నెరవేర్చండి
థాలీ బజావో కార్యక్రమం నిర్వహిస్తున్న కాంగ్రెస్‌ నాయకులు:

విజయనగరం రింగురోడ్డు/కలెక్టరేట్‌, జనవరి25 (ఆంధ్రజ్యోతి): ఎన్నికల ముందు కూటమి పార్టీలు ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చాలని కాంగ్రెస్‌ పార్టీ జిల్లా అధ్యక్షుడు (డీసీసీ) మరిపి విద్యాసాగర్‌ డిమాండ్‌ చేశారు. శనివారం కలెక్టరేట్‌ వద్ద పీసీసీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిలారెడ్డి ఆదేశాల మేరకు థాలీబజావో కార్యక్రమంలో భాగం గా డీసీసీ ఆధ్వర్యంలో ప్లేట్లు, స్పూన్లతో శబ్దం చేస్తూనిరసన కార్యక్రమం నిర్వహిం చారు. ఈ సందర్భంగా విద్యాసాగర్‌ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఏర్పాటై 227 రోజులుగడిచినా ఇప్పటివరకు పింఛన్లు, గ్యాస్‌పథకం తప్పా మిగతా హామీలను అమ లు చేయలేదని ఆరోపించారు. మేనిఫేస్టోలో చెప్పిన హామీలు అమలు చేయకపోతే ఆందోళన తప్పదని హెచ్చరించారు. కార్యక్రమంలో నియోజకవర్గ కోఆర్డినేటర్లు గేదెల తిరుపతిరావు, సతీష్‌, ఓబీసీ చైర్మన్‌ సురేష్‌, శ్రీనివాసరావు, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Jan 25 , 2025 | 11:51 PM