Share News

పరీక్ష పాస్‌ చేయిస్తానని మోసం

ABN , Publish Date - Feb 15 , 2025 | 12:33 AM

యూని వర్శిటీలో తెలిసిన వారు ఉన్నారు.. అన్ని సబ్జెక్టుల ను పాస్‌ చేయిస్తానని.. సుమారు రూ.12లక్షలు తీసుకు ని మోసం చేశాడో యువకుడు.

పరీక్ష పాస్‌ చేయిస్తానని మోసం

  • రూ. 12 లక్షలు వసూలు

  • చీటింగ్‌ కేసు నమోదు

బొబ్బిలి/రూరల్‌, ఫిబ్రవరి 14 (ఆంధ్రజ్యోతి): యూని వర్శిటీలో తనకు తెలిసిన వారు ఉన్నారు.. అన్ని సబ్జెక్టుల ను పాస్‌ చేయిస్తానని.. సుమారు రూ.12లక్షలు తీసుకు ని మోసం చేశాడో యువకుడు. దీనిపై 2024 జులై 13న బొబ్బిలి పోలీస్‌ స్టేషన్‌లో ఓ యువకుడిపై కేసు నమోదయింది. దర్యాప్తు చేపట్టిన పోలీసులు శుక్రవారం నిందితుడిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. ఈ ఘటనపై సీఐ కె.సతీష్‌కుమార్‌ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. బొబ్బిలి మున్సిపాలిటీ పరిధి వెలమవారి వీధికి చెందిన చింతల జయప్రకాశ్‌నాయుడు రాజాంలోని ఓ ప్రైవేటు కళాశాలలో ఇటీవల బీటెక్‌ పూర్తి చేశాడు. కానీ ఫైనలియర్‌ పాస్‌ కాలేదు. ఈక్రమంలో ఇదే కళాశాలలో బీటెక్‌ పూర్తిచేసి, రిలీవ్‌ అయిన సూపర్‌ సీనియర్‌, శ్రీకాకుళం జిల్లాకు చెందిన చైతన్యకుమార్‌.. జయప్రకాశ్‌ను పాస్‌ చేయిస్తానని నమ్మబలికాడు. తనకు డబ్బులు ఇస్తే ఫెయిల్‌ అయిన 13 సబ్జెక్టు లను యూనివర్సిటీలో మేనేజ్‌ చేసి పాస్‌ చేయిస్తానని చెప్పాడు. దీనికి జయ ప్రకాశ్‌ అంగీకరించాడు. తండ్రి అకౌంట్‌ నుంచి దఫదఫాలుగా చైతన్య కుమార్‌కు రూ.12 లక్షలు ముట్టజెప్పారు. కానీ జయప్రకాశ్‌ పాస్‌ కాలేదు. దీం తో తాను మోసపోయానని భావించిన జయప్రకాశ్‌ తన తండ్రి చంద్ర మౌళీశ్వరరావుతో కలిసి బొబ్బిలి పోలీసులను ఆశ్రయించాడు. ఈ మేరకు సీఐ కె.సతీష్‌కుమార్‌ కేసు నమోదు చేశారు. బొత్స చైతన్యకుమార్‌ను రిమాండ్‌కు తరలించారు.

Updated Date - Feb 15 , 2025 | 12:33 AM