Share News

దాడి కేసులో నలుగురి అరెస్టు

ABN , Publish Date - Jan 07 , 2025 | 12:28 AM

పట్టణంలోని గారమ్మ కాలనీలో నివసి స్తున్న పోస్టల్‌ అసిస్టెంట్‌ సూపరింటెండెంట్‌ ఎస్‌.సురేంద్రకుమార్‌పై గత ఏడా ది నవంబరులో దాడి చేసిన నలుగురిని స్థానిక పోలీసులు సోమవారం అరెస్టు చేశారు.

 దాడి కేసులో నలుగురి అరెస్టు

పాలకొండ, జనవరి 6 (ఆంధ్రజ్యోతి): పట్టణంలోని గారమ్మ కాలనీలో నివసి స్తున్న పోస్టల్‌ అసిస్టెంట్‌ సూపరింటెండెంట్‌ ఎస్‌.సురేంద్రకుమార్‌పై గత ఏడా ది నవంబరులో దాడి చేసిన నలుగురిని స్థానిక పోలీసులు సోమవారం అరెస్టు చేశారు. ఈమేరకు స్థానిక పోలీస్‌ స్టేషన్‌లో నిందితులను ప్రవేశపెట్టారు. ఈసందర్భంగా డీఎస్పీ రాంబాబు, ఎస్‌ఐ ప్రయోగమూర్తి కేసు వివరాలను వెల ్లడించారు. పాలకొండ మండలం నవగాం గ్రామంలో అసిస్టెంట్‌ బ్రాంచి పోస్టు మాస్టరుగా పనిచేస్తున్న కందివలస దుర్గాప్రసాద్‌.. అసిస్టెంట్‌ సూపరిం టెండెంట్‌ సురేంద్రకుమార్‌ తనకు సెలవులు ఇవ్వకుండా ఇబ్బంది పెడుతు న్నారని మనసులో కక్ష పెంచుకున్నాడు. విజయనగరానికి చెందిన దుర్గాప్రసాద్‌ అక్కడ తన స్నేహితులకు ఈ విషయాన్ని తెలియజేసి, దాడి చేయాలని పుర మాయించాడు. షేక్‌ షాజహాన్‌ అనే వ్యక్తికి సురేంద్రకుమార్‌ను చూపించాడు. దీంతో షాజహాన్‌ వారం రోజులు రెక్కీ నిర్వహించాడు. ఇంట్లో సురేంద్రకుమార్‌ ఒక్కరే ఉంటున్నారని గుర్తించాడు. దసరా నవరాత్రుల్లో నవంబరు 8వ తేదీన షేక్‌ షాజహాన్‌.. ప్రకాష్‌, పి.రాజులతో కలిసి సురేంద్రకుమార్‌ ఇంట్లోకి చొరబడి, ఆయనపై దాడి చేశారు. తలుపులకు బయట నుంచి గొల్లెం పెట్టి దూరంగా ఉంచిన తమ వాహనాలపై అక్కడ నుంచి విజయనగరం చేరుకున్నారు. సురేంద్రకుమార్‌ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు. సీసీ ఫుటేజ్‌, సెల్‌ఫోన్‌ సిగ్నల్‌ ద్వారా వివరాలు సేకరి ంచారు. నిందితులను అరెస్టు చేశారు. ఈ కేసును కొలిక్కి తీసుకొచ్చిన పాల కొండ సీఐ చంద్రమౌళి, ఇతర పోలీసులను డీఎస్పీ అభినందించారు.

Updated Date - Jan 07 , 2025 | 12:28 AM