hostels వసతిగృహాల్లో సమస్యలపై దృష్టి
ABN , Publish Date - Feb 14 , 2025 | 11:34 PM
Focus on Issues in hostels జిల్లాలో ప్రభుత్వ వసతిగృహాల్లో సమస్యలపై దృష్టిసారించాలని కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ ఆదేశించారు. శుక్రవారం క్యాంప్ కార్యాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సంబంధిత అధికారులతో సమీక్షించారు.

పార్వతీపురం, ఫిబ్రవరి 14 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో ప్రభుత్వ వసతిగృహాల్లో సమస్యలపై దృష్టిసారించాలని కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ ఆదేశించారు. శుక్రవారం క్యాంప్ కార్యాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సంబంధిత అధికారులతో సమీక్షించారు. పల్లె నిద్ర కార్యక్రమంలో భాగంగా అధికారులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవడం వల్ల చాలా వరకు వసతిగృహాల్లో పరిస్థితి మెరుగుపడిందన్నారు. అయితే ఇంకొన్ని చోట్ల సమస్యలున్నట్టు తమ దృష్టికి వచ్చిందన్నారు. ఈ మేరకు ప్రత్యేకాధికారులు చొరవ తీసుకుని.. ఆయా వసతిగృహాల్లో విద్యార్థుల విద్యా ప్రమాణాలు, పారిశుధ్యం నిర్వహణపై దృష్టి సారించాలన్నారు. నాణ్యమైన పౌష్టికాహారం అందేలా చూడాలన్నారు.
సంజీవయ్య స్ఫూర్తితో..
మాజీ ముఖ్యమంత్రి దామోదరం సంజీవయ్య స్ఫూర్తితో ప్రతి ఒక్కరు ముందుకు సాగాలని కలెక్టర్ పిలుపునిచ్చారు. కలెక్టరేట్‌లో సంజీవయ్య జయంతి వేడుకలను నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి కలెక్టర్ పూల మాలలు వేసి నివాళి అర్పించారు. అనంతరం సంజీవయ్య సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో డీఆర్వో కె.హేమలత, జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమాధికారి ఎస్.కృష్ణ, ప్రత్యేక ఉప కలెక్టర్ పి.ధర్మచంద్రారెడ్డి తదితరులు పాల్గొన్నారు.