fee allot ఎట్టకేలకు ఫీజు రీయింబర్స్‌మెంట్
ABN , Publish Date - Feb 17 , 2025 | 12:16 AM
Finally fee reimbursement విద్యార్థులకు గుడ్‌న్యూస్. వైసీపీ ప్రభుత్వ హయాంలో నిలిచిపోయిన ఫీజు రీయింబర్స్‌మెంట్ నిధులను కూటమి ప్రభుత్వం విడుదల చేసింది. ఇందుకు సంబంధించి ఉత్తర్వులు కూడా ఇచ్చింది. పాత బకాయిలతో పాటు ఈ విద్యాసంవత్సరానికి సంబంధించి 38,354 మంది విద్యార్థులకు రూ.30.61 కోట్లు విడుదల చేసింది. అవి కళాశాలల యాజమాన్యాల ఖాతాల్లో పడుతున్నాయి.

ఎట్టకేలకు ఫీజు రీయింబర్స్‌మెంట్
బకాయిలతో పాటు ఈ విద్యాసంవత్సర నిధులూ విడుదల
రూ.30.61 కోట్లు కేటాయించిన ప్రభుత్వం
రాజాం, ఫిబ్రవరి 16(ఆంధ్రజ్యోతి): విద్యార్థులకు గుడ్‌న్యూస్. వైసీపీ ప్రభుత్వ హయాంలో నిలిచిపోయిన ఫీజు రీయింబర్స్‌మెంట్ నిధులను కూటమి ప్రభుత్వం విడుదల చేసింది. ఇందుకు సంబంధించి ఉత్తర్వులు కూడా ఇచ్చింది. పాత బకాయిలతో పాటు ఈ విద్యాసంవత్సరానికి సంబంధించి 38,354 మంది విద్యార్థులకు రూ.30.61 కోట్లు విడుదల చేసింది. అవి కళాశాలల యాజమాన్యాల ఖాతాల్లో పడుతున్నాయి.
ఎస్టీ విద్యార్థులకు శతశాతం నిధులు విడుదల చేయగా.. ఎస్సీ విద్యార్థులకు 40 శాతం..బీసీ విద్యార్థులకు 25 శాతం విడుదల చేసింది. మరో రెండు విడతల్లో మిగిలిన బకాయిలతో పాటు ఈ ఏడాదికి సంబంధించిన ఫీజు జమ చేయనున్నట్టు అధికారులు చెబుతున్నారు. గత ఐదేళ్ల వైసీపీ పాలనలో ఫీజు రీయింబర్స్‌మెంట్ చెల్లించక భారీగా పేరుకుపోయింది. విద్యాదీవెన, వసతి దీవెన పథకాలకు సంబంధించి రూ.352 కోట్ల బకాయిలు ఉన్నట్టు తెలుస్తోంది. ఐటీఐ, డిప్లమో, డిగ్రీ, పీజీ, ఇతర వృత్తిపరమైన కోర్సులు చదువుకున్న వారికి వందశాతం ఫీజును ప్రభుత్వమే చెల్లిస్తుందని అప్పట్లో సీఎం జగన్ ప్రకటించారు. కానీ అమలు చేయడంలో విఫలమయ్యారు. అది పేద విద్యార్థులకు శాపంగా మారింది. కళాశాలల యాజమాన్యాల నుంచి ఒత్తిడి పెరుగుతుండడంతో ప్రస్తుతం తల్లిదండ్రులు అప్పులు చేసి ఫీజులు కడుతున్నారు. అప్పట్లో సీఎం జగన్ ప్రకటనలు చూసి చాలా మంది స్తోమతకు మించిన కాలేజీల్లో పిల్లలను చేర్పించారు. ప్రభుత్వమే భరిస్తుందని చెప్పడంతో నమ్మి మోసపోయారు. దీనిపై రాష్ట్ర వ్యాప్తంగా ఫిర్యాదులు వస్తుండడంతో విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ స్పందించారు. జగన్ ప్రవేశపెట్టిన దీవెనల స్థానంలో ఫీజు రీయింబర్స్‌మెంట్, మెస్ రీయింబర్స్‌మెంట్ పథకాలను ఏర్పాటుచేశారు. ప్రాధాన్యతాక్రమంలో పెండింగ్ బిల్లులు విడుదల చేస్తున్నారు. అందులో భాగంగా తొలి విడతలో రూ.30.61 కోట్లు విడుదల చేశారు.
------------