విద్యార్థినులు అన్ని రంగాల్లో రాణించాలి
ABN , Publish Date - Jan 27 , 2025 | 01:12 AM
విద్యార్థినులు అన్ని రంగాల్లో రాణించాలని గిరిజన సంక్షేమ, మహిళా శిశు సంక్షేమ శాఖా మంత్రి గుమ్మిడి సంధ్యారాణి అన్నారు.
సాలూరు, జనవరి 26 (ఆంధ్రజ్యోతి): విద్యార్థినులు అన్ని రంగాల్లో రాణించాలని గిరిజన సంక్షేమ, మహిళా శిశు సంక్షేమ శాఖా మంత్రి గుమ్మిడి సంధ్యారాణి అన్నారు. గణతంత్ర దినోత్సవంలో భాగంగా ఆదివారం ఆమె సాలూరులోని మహాత్మా జ్యోతీరావు పూలే వెనుకబడిన తరగతుల బాలికల ఆశ్రమ పాఠశాలను సందర్శించారు. విద్యా ర్థినుల సాంస్కృతిక కార్యక్రమాలను తిల కించారు. రౌండ్ టేబుల్ ఇండియా స్వచ్ఛంద సంస్థ సహకారంతో ఏర్పాటుచేసిన కంప్యూటర్ ల్యాబ్‌ను ప్రారంభించారు. ఎండీఎం ఆహార పదార్థాలను పరిశీలించి, రుచి చూశారు. అనంతరం ఏర్పాటుచేసిన సమావేశంలో మంత్రి మాట్లాడారు. బాల్య వివాహాలను అరికట్టాలన్నారు. సెల్‌ఫోన్‌లను అవరసమైన మేరకే ఉపయోగించాలని బాలికలకు సూచించారు. త్వరలోనే పాఠశాలకు స్థలాన్ని మంజూరు చేస్తామని చెప్పారు. ఈ కార్యక్ర మంలో టీడీపీ పట్టణ అధ్యక్షుడు నిమ్మాది తిరుపతిరావు, బలగ శ్రీను, పరమేష్, హర్షవర్ధన్, ప్రిన్సిపాల్ మూకల పెంటయ్యతో పాటు పలువురు పాల్గొన్నారు.