Share News

కొండపై తవ్వకాలు సరికాదు

ABN , Publish Date - Jan 31 , 2025 | 12:33 AM

మండలంలో ని కోరి రెవెన్యూ పరిధిలో బడిదేవరమ్మ కొండ మైనింగ్‌ తవ్వకాలకు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన అన్ని రకాల అనుమ తులను రద్దు చేయా లని కొండ పరిసర ప్రాంత గిరిజనులు, కొండ పరిరక్షణ కమిటీ నాయకులు డిమాండ్‌ చేశారు.

కొండపై తవ్వకాలు సరికాదు

పార్వతీపురం, జనవరి 30 (ఆంధ్ర జ్యోతి): మండలంలో ని కోరి రెవెన్యూ పరిధిలో బడిదేవరమ్మ కొండ మైనింగ్‌ తవ్వకాలకు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన అన్ని రకాల అనుమ తులను రద్దు చేయా లని కొండ పరిసర ప్రాంత గిరిజనులు, కొండ పరిరక్షణ కమిటీ నాయకులు డిమాండ్‌ చేశారు. ఈ మేరకు గురువారం పార్వతీపురం ఐటీడీఏ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కొండపై గిరిజనులకు పోడు పట్టాలు ఇచ్చారని, అక్కడ మైనింగ్‌ తవ్వకాలకు ఎలా అనుమతి ఇస్తారని ప్రశ్నించారు. అక్కడ గిరిజను లు బడిదేవరమ్మను దేవతగా కొలుస్తారని అన్నారు. అడ్డగోలు తవ్వకాలకు అనుమతులు ఇచ్చి గిరిజన బతుకులు నాశనం చేస్తుంటే చూస్తూ ఊరుకోబో మని హెచ్చరించారు. ధర్నాకు వచ్చిన ఐటీడీఏ ఏపీవో మురళీ ధర్‌, ఏవో ప్రసాద్‌లకు వినతిపత్రం అందించారు. ఈ కార్యక్రమంలో కొండ పరిరక్షణ పోరాట కమిటీ నాయకు లు మూడడ్ల కృష్ణమూర్తి, బొత్స నరసింహమూర్తి, పి.శ్రీనునాయుడు, ఊయక ముత్యాలు, ఎం.భాస్కరరావు, పాలక రంజిత్‌కుమార్‌, బుడితి అప్పలనాయుడు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Jan 31 , 2025 | 12:33 AM