రైతులకు బకాయిలను చెల్లించాలి
ABN , Publish Date - Jan 16 , 2025 | 11:57 PM
ధాన్యం కొనుగోలు కేం ద్రాల ద్వారా 2021-22 సంవ త్సరంలో ధాన్యాన్ని రైసుమిల్లుల కు తరలించిన రైతులకు రా వల్సిన రవాణా చార్జీల బకా యిలను వెంటనే చెల్లించాలని జిల్లా రైతు సంఘం అధ్యక్షుడు సింగిరెడ్డి గోపాలం డిమాండ్ చేశారు.

బొబ్బిలి, జనవరి 16 (ఆంధ్ర జ్యోతి):ధాన్యం కొనుగోలు కేం ద్రాల ద్వారా 2021-22 సంవ త్సరంలో ధాన్యాన్ని రైసుమిల్లుల కు తరలించిన రైతులకు రా వల్సిన రవాణా చార్జీల బకా యిలను వెంటనే చెల్లించాలని జిల్లా రైతు సంఘం అధ్యక్షుడు సింగిరెడ్డి గోపాలం డిమాండ్ చేశారు. గురువారం బొబ్బిలి పీఏ సీఎస్‌అధికారికి వినతి పత్రం అందజేశారు. ఈ సంద ర్భంగా ఆయన మాట్లాడుతూ అప్పటి వైసీపీ ప్రభుత్వం రైతులకు లోడింగ్, అన్‌లోడింగ్, రవాణాచార్జీలు ఇస్తామని ప్రకటించడంతో రైతులు తమ సొంత సొమ్ము ఖర్చు పెట్టి రవాణా చేశారని తెలిపారు. ఈ విషయంపై రైతు సంఘం ఆధ్వర్యంలో నిరసన చేపడితే ఆ నిధులను సొసైటీలకు ప్రభుత్వం విడుదల చేసిందని చెప్పారు. సొసైటీ నుంచి రైతులకు చెల్లింపులు జరగలేదని తెలిపారు. సొసైటీ అధికారులు తక్షణమే స్పందించి రైతులకు రావాల్సిన లోడింగ్, అన్‌లోడింగ్, రవాణా చార్జీలను చెల్లించాలని డిమాండ్ చేశారు. లేకుంటే రైతులతో కలిసి ఆందోళన చేస్తామని గోపాలం తెలిపారు.