Share News

talent ప్రతిభలో తీసిపోమని..!

ABN , Publish Date - Jan 07 , 2025 | 12:28 AM

లాంగ్‌ జంప్‌... రన్నింగ్‌.. షార్ట్‌పుట్‌.. ప్రతి క్రీడలోనూ ప్రతిభ చూపించారు. చూపరులను ఆశ్చర్యచకితులను చేశారు.

talent  ప్రతిభలో తీసిపోమని..!
షార్ట్‌పుట్‌ విసురుతున్న విద్యార్థిని

  • క్రీడల్లో రాణించిన విభిన్న ప్రతిభావంతులు

  • ఆసక్తికరంగా పారా అథ్లెటిక్స్‌

విజయనగరం టౌన్‌, జనవరి 6(ఆంధ్రజ్యోతి): లాంగ్‌ జంప్‌... రన్నింగ్‌.. షార్ట్‌పుట్‌.. ప్రతి క్రీడలోనూ ప్రతిభ చూపించారు. చూపరులను ఆశ్చర్యచకితులను చేశారు. తాము ఎవరికీ తీసిపోమని నిరూపించారు. ఇదీ విభిన్న... ‘ప్రతిభావం తుల’ విజయం. జిల్లా క్రీడాప్రాధికార సంస్థ సహకారంతో విభిన్న ప్రతిభావంతులకు జిల్లా స్థాయి పారా అథ్లెటిక్‌ పోటీలు సోమవారం రాజీవ్‌ స్టేడియంలో ఘనంగా నిర్వహించారు. ఈ పోటీలకు ముఖ్య అతిథిగా అసోసియేషన్‌ కార్యదర్శి వి.రామస్వామి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రన్నింగ్‌, జావెలిన్‌, డిస్కస్‌త్రో, లాంగ్‌ జంప్‌, షార్ట్‌పుట్‌ క్రీడలకు వివిధ విభాగాల వారీగా పోటీలు నిర్వహించామని తెలిపారు. జిల్లా నుంచి 70 మంది పారా క్రీడాకారులు హాజరయ్యారని వివరించారు. ఉత్తమ ప్రతిభ కనబరిచిన 33 మందిని ఈ నెల 30న గుంటూరులో జరగబోయే రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపిక చేస్తున్నట్టు వెల్లడించారు.

Updated Date - Jan 07 , 2025 | 12:28 AM