Share News

రక్తదానం ప్రాణదానంతో సమానం

ABN , Publish Date - Mar 05 , 2025 | 12:10 AM

రక్తదానం ప్రాణదానంతో సమానమని కలెక్టర్‌ ఎ.శ్యాంప్రసాద్‌ అన్నారు.

రక్తదానం ప్రాణదానంతో సమానం

బెలగాం, మార్చి 4 (ఆంధ్రజ్యోతి): రక్తదానం ప్రాణదానంతో సమానమని కలెక్టర్‌ ఎ.శ్యాంప్రసాద్‌ అన్నారు. మంగళవారం లైన్‌ మెన్‌ దివస్‌ను పురస్కరించుకుని ఏపీడీసీ ఎల్‌ ఆధ్వర్యంలో స్థానిక విద్యుత్‌ కార్యాలయం వద్ద నిర్వహించిన ‘నేను సైతం’ రక్తదాన శిబిరాన్ని ఆయన ప్రారంభించారు. ముందుగా ఆయన కార్యా లయ ఆవరణలో మొక్కలు నాటారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి ఆరు నెలలకు ఒకసారి ప్రతిఒక్కరూ రక్తదానం చేయాలని పిలుపు నిచ్చారు. ఈ రక్తదాన శిబిరంలో 89 యూనిట్లు రక్తాన్ని సేకరించినట్టు వైద్యాధికారి తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏపీఈపీడీసీఎల్‌ పర్యవేక్షక ఇంజినీర్‌ కె.చలపతిరావు, కార్యనిర్వాహక ఇంజినీర్‌ కె.గోపాలరావునాయుడు, జిల్లా ఆసుపత్రి సూప రింటెండెంట్‌ డా.వాగ్దేవి తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Mar 05 , 2025 | 12:10 AM