District Petitions వినతులు 46,446
ABN , Publish Date - Feb 13 , 2025 | 12:25 AM
District Petitions: 46,446 వినతుల స్వీకరణలో రాష్ట్రంలోనే పార్వతీపురం మన్యం జిల్లా ద్వితీయ స్థానంలో ఉంది. ఈ మేరకు ప్రభుత్వం ప్రకటించింది. 26 జిల్లాల్లో మన్యం జిల్లాకు అత్యధిక అర్జీలు వచ్చాయని స్పష్టం చేసింది. పీజీఆర్‌ఎస్, రెవెన్యూ సదస్సులు, ఇతర కార్యక్రమాల ద్వారా వివిధ సమస్యలపై మొత్తంగా 46,446 వినతులు వచ్చినట్లు వెల్లడించింది.

ఇందులో పీజీఆర్‌ఎస్‌వి 32,803..
రెవెన్యూ శాఖవి 7,173
పార్వతీపురం,ఫిబ్రవరి12(ఆంధ్రజ్యోతి): వినతుల స్వీకరణలో రాష్ట్రంలోనే పార్వతీపురం మన్యం జిల్లా ద్వితీయ స్థానంలో ఉంది. ఈ మేరకు ప్రభుత్వం ప్రకటించింది. 26 జిల్లాల్లో మన్యం జిల్లాకు అత్యధిక అర్జీలు వచ్చాయని స్పష్టం చేసింది. పీజీఆర్‌ఎస్, రెవెన్యూ సదస్సులు, ఇతర కార్యక్రమాల ద్వారా వివిధ సమస్యలపై మొత్తంగా 46,446 వినతులు వచ్చినట్లు వెల్లడించింది. ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్‌ఎస్) ద్వారా పాలకొండ డివిజన్‌లో 11,464, పార్వతీపురం డివిజన్‌లో 21,339 వినతులు అందాయి. ఇందులో 10,778 వినతులను పరిష్కరిం చారు. రెవెన్యూ సదస్సుల ద్వారా పాలకొండ డివిజన్‌లో 2,895, పార్వతీపురం డివిజన్ లో 4,278 అర్జీలు వచ్చాయి. ఇందులో 2,470 సమస్యలు పరిష్కరించారు.
మండలాల వారీగా పీజీఆర్‌ఎస్ ద్వారా..
- పీజీఆర్‌ఎస్ ద్వారా జిల్లా ఉన్నతాధికారులకు 100 వినతులు, పాలకొండ సబ్ కలెక్టర్‌కు 30 అర్జీలు వచ్చాయి. మండలాల వారీగా చూస్తే.. సీతంపేట మండలంలో 867, జియ్యమ్మవలసలో 2,059, కురుపాంలో 778, పాలకొండలో 2357, భామినిలో 1784, గుమ్మలక్ష్మీపురంలో 834, వీరఘట్టంలో 2705 చొప్పున అర్జీలు వచ్చాయి.
- పార్వతీపురం డివిజన్‌లో సబ్‌కలెక్టర్‌కు 132 వినతులు రాగా ఈ డివిజన్‌లో మండలాల వారీగా చూస్తే.. మక్కువలో 1386, గరుగుబిల్లిలో 1290, కొమరాడలో 4,254, పాచిపెంటలో 1920, బలిజిపేటలో 4,214, పార్వతీపురంలో 3,919, సాలూరులో 10,99, సీతానగరంలో 3125 వినతులు వచ్చాయి.
రెవెన్యూ సదస్సుల ద్వారా
- జియ్యమ్మవలస మండలంలో 534, వీరఘట్టంలో 273, సీతంపేటలో 519, భామినిలో 573, కురుపాంలో 257, గుమ్మలక్ష్మీపురంలో 384, పాలకొండలో 355 వినతులు వచ్చాయి.
-బలిజిపేటలో 143, గరుగుబిల్లిలో 215, సాలూరులో 354, సీతానగరం 777, కొమరాడలో 373, మక్కువలో 682, పాచిపెంటలో 745, పార్వతీపురంలో 689 విన తులు అందాయి. ప్రధానంగా గత వైసీపీ ప్రభుత్వ హయాంలో చేపట్టిన రీ సర్వేలో జరిగిన తప్పులను సరి చేయాలని అత్యధికంగా ఆర్జీలు వచ్చినట్లు సమాచారం.
పోలీస్ గ్రీవెన్స్‌లో..
- పోలీసు గ్రీవెన్స్‌లో మన్యం జిల్లా ప్రథమ స్థానంలో నిలిచింది. మొత్తంగా 693 వినతులు స్వీకరించినట్లు ప్రభుత్వం వెల్లడించింది.
- గృహ నిర్మాణ శాఖకు సంబంధించి 12,720 వినతులు వచ్చాయి.
సబ్ కలెక్టర్లకు అదనపు బాధ్యతలు..
పాలకొండ, పార్వతీపురం సబ్ కలెక్టర్లు ఐటీడీఏల ఇన్‌చార్జి పీవోలుగా అదనపు బాధ్యతలను నిర్వహిస్తున్నారు. మరోవైపు జిల్లాలో తహసీల్దార్లు కూడా పూర్తిస్థాయిలో లేకపోవడంతో రెవెన్యూ సమస్యలకు మోక్షం లభించడం లేదు.
పూర్తిస్థాయిలో పరిష్కరిస్తాం
రెవెన్యూ సదస్సుల్లో వచ్చిన వినతులతో పాటు వివిధ కార్యక్రమాల్లో వచ్చిన అర్జీలను పూర్తిస్థాయిలో పరిశీలిస్తాం. ఈ నెలాఖరులోపు అన్ని సమస్యలను పరిష్కరిస్తాం.
- హేమలత, జిల్లా రెవెన్యూ డివిజన్ అధికారి