Diarrhea :పొందూరులో ప్రబలిన డయేరియా
ABN , Publish Date - Jan 06 , 2025 | 11:56 PM
Diarrhea : పొందూరులోని ఖస్పావీధి డయేరియా విజృంభించింది. మూడురోజుల కిందట డయేరియా ప్రబల డంతో తొలుత బాధితులను పొందూరు ప్రభుత్వాసుపత్రిలో చేర్పించారు.

పొందూరు, జనవరి 6 (ఆంధ్రజ్యోతి) : పొందూరులోని ఖస్పావీధి డయేరియా విజృంభించింది. మూడురోజుల కిందట డయేరియా ప్రబల డంతో తొలుత బాధితులను పొందూరు ప్రభుత్వాసుపత్రిలో చేర్పించారు. వీరిలో ఐదుగురిని శ్రీకాకుళం రిమ్స్‌కు తరలించారు. ప్రస్తుతం ఆ వీధిలో 15 మంది వరకు డయేరియాతో మంచపట్టారు. పది మందికి పొందూరు సీహెచ్‌సీలో సేవలందుతున్నాయి. వ్యాధి తీవ్రత పెరుగుతుండడంతో తాడి వలస పీహెచ్‌సీ వైద్యుడు రమేష్‌నాయుడు ఆధ్వర్యంలో సిబ్బంది ఖస్పా వీధిలో వైద్యశిబిరాన్ని నిర్వహించారు. పంచాయతీ సిబ్బంది ఖస్పావీధితో పాటు సమీప వీధుల్లో పారిశుధ్యకార్యక్రమం నిర్వహించారు. తాగునీటి వనరుల్లో క్లోరినేషన్‌చేశారు. కాగా ఖస్పావీధి లో డయేరియా ప్రబలడంతో ఎమ్మెల్యే కూన రవికుమార్ పంచాయతీ, వైద్యసిబ్బందిని అప్రమత్తం చేశారు. డీఎంహెచ్‌వో బి.కృష్ణతో ఫోన్‌లో మాట్లాడగా ఆయన హుటాహుటిన పొందూరు చేరుకున్నారు. దీంతో వారిద్దరూ బాధితులను సోమవారం పరామర్శించారు. రానున్న వారంరోజుల్లో పండుగల నేపథ్యం లో వ్యాధి మరింత విజృంభించే అవకాశ ముందని, అప్రమత్తంగా ఉండాలని వైద్య సిబ్బందిని, పంచాయతీ ఈవో మోహన్‌బాబును వారు ఆదేశించారు. అనంతరం డీఎంహెచ్‌వో పొందూరు ఆసుపత్రిలో డయేరియా లక్షణాలతో చికిత్సపొందుతున్న బాలుడిని పరామర్శించారు.