Share News

ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన వ్యక్తి మృతి

ABN , Publish Date - Feb 26 , 2025 | 12:20 AM

పూసపాటిరేగ మండలం చింతపల్లికి చెందిన కిలాన ఎరకారావు (33) లిం గాలవలస సమీపంలో ఆత్మహత్యాయత్నానికి పాల్పడి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం మృతి చెందారని ఎస్‌ఐ పి.సూర్యకుమారి తెలిపా రు.

ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన వ్యక్తి మృతి

భోగాపురం, ఫిబ్రవరి25 (ఆంధ్రజ్యోతి): పూసపాటిరేగ మండలం చింతపల్లికి చెందిన కిలాన ఎరకారావు (33) లిం గాలవలస సమీపంలో ఆత్మహత్యాయత్నానికి పాల్పడి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం మృతి చెందారని ఎస్‌ఐ పి.సూర్యకుమారి తెలిపా రు. ఈ ఘటనకు సంబంఽధించి ఎస్‌ఐ తెలిపిన వివరాల మేరకు.. చింతపల్లికి చెందిన ఎరకారావు విశాఖలో వంట పని చేస్తూ కుటుంబాన్ని పోషిం చుకుంటున్నాడు. అతడి భార్య, పిల్లలు లింగాలవలస సమీపంలో నివాసం ఉంటున్నారు. అయితే ఇటీవల ఇల్లు నిర్మాణం చేపట్టడంతో ఎరకారావు అప్పులపాలయ్యాడు. అప్పులు ఇచ్చిన వారు ఒత్తిడి చేయడంతో మనస్తాపానికి గురయ్యాడు. సోమవారం లింగాలవలస మద్యం దుకాణం సమీపానానికి వచ్చి నేను చనిపోతున్నానని భార్యకు ఫోన్‌ చేసి చెప్పాడు. దాంతో భార్య బంధువులతో కలిసి మద్యం దుకాణం సమీపానికి వచ్చి చూడగా అపస్మారక స్థితిలో ఉన్నారన్నారు. ఎరకారావును చికిత్స నిమిత్తం సుందరపేట సామాజిక ఆసుపత్రికి తరలించారు. అక్కడ పరిస్థితి విషమంగా మారడంతో విజయ నగరం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారన్నారు. అక్కడ చికిత్స పొందుతూ మృతి ఎరకారావు చెందారన్నారు. మృతుడికి తల్లిదండ్రులు, భార్య దుర్గ, పిల్ల లు వీరేంద్ర, అవంతిక ఉన్నారు. దీనిపై మృతుడు భార్య కిలాన దుర్గ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని ఎస్‌ఐ సూర్యకుమారి తెలిపారు.

Updated Date - Feb 26 , 2025 | 12:20 AM