Share News

క్రికెట్‌ విజేత రావివలస

ABN , Publish Date - Jan 16 , 2025 | 12:32 AM

రావివలసలో ఫ్రెండ్స్‌ యూత్‌ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన క్రికెట్‌ టోర్నమెంట్‌ రావివలస జట్టు విజయం సాధిం చింది. సంక్రాంతి పురస్కరించుకుని నిర్వహించిన ఈ టోర్నమెంట్‌లో 13 జట్లు పాల్గొన్నాయి.ఈ మేరకు బుధవారం విజేతలకు నిర్వాహకుతోపాటు ఎంపీటీసీ సభ్యుడు కోట భరత్‌కుమార్‌ బహుమతులు ప్రదానంచేశారు.

క్రికెట్‌ విజేత రావివలస
గరుగుబిల్లి:: విజేతలకు బహుమతులు అందిస్తున్న నిర్వాహకులు

గరుగుబిల్లి, జనవరి 15 (ఆంధ్రజ్యోతి): రావివలసలో ఫ్రెండ్స్‌ యూత్‌ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన క్రికెట్‌ టోర్నమెంట్‌ రావివలస జట్టు విజయం సాధిం చింది. సంక్రాంతి పురస్కరించుకుని నిర్వహించిన ఈ టోర్నమెంట్‌లో 13 జట్లు పాల్గొన్నాయి.ఈ మేరకు బుధవారం విజేతలకు నిర్వాహకుతోపాటు ఎంపీటీసీ సభ్యుడు కోట భరత్‌కుమార్‌ బహుమతులు ప్రదానంచేశారు.

ఫ బొబ్బిలి రూరల్‌, జనవరి 15 (ఆంధ్రజ్యోతి): జగన్నాఽథపురంలో బుధవారం క్రికెట్‌ పోటీలు గ్రామ యువజన సంఘం ఆధ్వర్యంలో నిర్వహించారు. విజేతలకు ఎంపీటీసీ తిరుపతిరావు, బొద్దల సత్యనారాయణ బహుమతులు అందజేశారు.

పిరిడిలో కబడ్డీ ..

బొబ్బిలి రూరల్‌, జనవరి 15 (ఆంధ్రజ్యోతి): మండలంలోని పిరిడిలో సంక్రాంతి సంబరాలు పురస్కరించుకుని కబడీపోటీలు ఉత్సాహంగా ఘనంగా నిర్వహించా రు. పోటీలకు గొల్లపల్లి, వెంకటరాయుడుపేట నుంచి 30 జట్లు హాజరయ్యా యని నిర్వాహకులు తెలిపారు. విజేతలకు సర్పంచ్‌ భరత్‌ బహుమతులు అందజేశారు.

గజరాయునివలసలో రాతి బండ ..

బాడంగి, జనవరి 15 (ఆంధ్రజ్యోతి): మండలంలోని గజరాయునివలసలో సం క్రాంతి పురస్కరించుకుని 800కేజీల బరువుగల రాతిబండను ఎడ్లు ద్వారా లాగిం చేపోటీలు నిర్వహించారు. ఈపోటీల్లో 20 జట్లు పాల్గొనగా మక్కువ మండలం లోని శంబర గ్రామానికి చెందిన జాడ దాలయ్య మొదటి బహుమతి, రెండో బహుమతి అదే మండలానికి చెందిన నగిరెడ్డి త్రినాఽథ, తెర్లాం మండలం లోచర్ల గ్రామానికి చెందిన వెలగల వెంకటరమణ తృతీయ బహుమతి గెలుచుకున్నారు.

పాత బొబ్బిలినాయుడు వీధిలో రంగవల్లులు ..

బొబ్బిలి, జనవరి 15 (ఆంధ్రజ్యోతి):పాత బొబ్బిలి నాయుడు వీధి యువత ఆధ్వర్యంలో మునిసిపల్‌ మాజీ వైస్‌ చైర్మన్‌ చోడిగంజి రమేష్‌నాయుడు పర్యవే క్షణలో రంగవల్లుల పోటీలు నిర్వహించారు.విజేతలకు కారుణ్య షౌండేషన్‌ చైర్మన్‌ జేసీరాజు బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో చోడి గంజి రవి, కౌన్సిలర్‌ రాములు పాల్గొన్నారు.

Updated Date - Jan 16 , 2025 | 12:32 AM