రూ.300 కోట్లతో రహదారుల నిర్మాణం
ABN , Publish Date - Jan 08 , 2025 | 12:48 AM
రాష్ట్రంలో గల ప్రతి గ్రామంలో రహదారుల నిర్మాణానికి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు రూ.300 కోట్లు మంజూరు చేశారని రాష్ట్ర గిరిజన సంక్షేమ, స్త్రీ శిశు సంక్షేమశాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి తెలిపారు.
పాచిపెంట, జనవరి 7 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో గల ప్రతి గ్రామంలో రహదారుల నిర్మాణానికి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు రూ.300 కోట్లు మంజూరు చేశారని రాష్ట్ర గిరిజన సంక్షేమ, స్త్రీ శిశు సంక్షేమశాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి తెలిపారు. మంచాడవలస గ్రామం లో 274 మీటర్ల సీసీ రోడ్డును రూ.11లక్షలతో నిర్మించిన రోడ్డును ఆమె మంగళవారం ప్రారంభించారు. సాలూరు నియోజకవర్గానికి రూ.80కోట్లు మంజూరయ్యాయన్నారు. పాచిపెంట మండలంలో 27 రహదారులు పూర్తి చేశామ ని, ఇంకా 20 రహదారులు ఉన్నాయని చెప్పారు. డోలీ మోతలు లేకుండా ప్రతి గిరిజన గ్రామానికి లింకు రోడ్లు నిర్మిస్తామన్నారు. ప్రతి గ్రామానికి సాగునీరు సౌకర్యం కల్పిస్తామని తెలిపారు. అనర్హులకు సంబంధించి రాష్ట్రంలో ఐదు లక్షల పింఛన్లు ఉన్నాయని, వాటిపై పరిశీలన చేస్తున్నారని చెప్పారు. ఈ సమావేశంలో టీడీపీ మండల అధ్యక్షుడు పిన్నింటి ప్రసాద్‌బాబు, నాయకులు ముఖి సూర్యనారాయణ, కొరిపల్లి సురేష్, గూడేపు యుగంధర్, చల్లా కనకబాబు, కొత్తల పోలినాయుడు తదితరులు పాల్గొన్నారు.
పాచిపెంట పేరును పసిడి పంటగా మారుస్తా..
చెప్పుకోవడానికి, వినడానికి అసహ్యంగా ఉన్న పాచిపెంట గ్రామం పేరును పసిడి పంటగా మారుస్తానని మంత్రి సంధ్యారాణి సభా ముఖంగా తెలిపారు. ఈ మేరకు తీర్మానం చేసి ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్తానని తెలిపారు. ఈ నిర్ణయం అందరికీ ఇష్టమేనా అని అడగగా, సభలో ఉన్న వారంతా అంగీకారం తెలుపుతూ కరతాళ ధ్వనులతో హర్షం వ్యక్తం చేశారు.