Supervision పర్యవేక్షణ లోపిస్తే చర్యలు తప్పవు
ABN , Publish Date - Feb 15 , 2025 | 11:22 PM
Consequences Are Inevitable If Supervision Fails ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల పరిధిలో పరిశుభ్రతపై పర్యవేక్షణ లోపిస్తే చర్యలు తప్పవని డీఎంహెచ్‌వో ఎస్.భాస్కరరావు అన్నారు. శనివారం రావివలస ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మికంగా పరిశీలించారు.

గరుగుబిల్లి, ఫిబ్రవరి 15 (ఆంధ్రజ్యోతి): ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల పరిధిలో పరిశుభ్రతపై పర్యవేక్షణ లోపిస్తే చర్యలు తప్పవని డీఎంహెచ్‌వో ఎస్.భాస్కరరావు అన్నారు. శనివారం రావివలస ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మికంగా పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... స్వర్ణ ఆంధ్ర - స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమంలో భాగంగా ప్రతి నెలలో మూడో శనివారం పరిసరాలు పరిశుభ్రతతో పాటు బయోమెడికల్ వ్యర్థాలు, మరుగుదొడ్లు శుభ్రతను పరిశీలించి మెరుగుపర్చాలన్నారు. ఆరోగ్య కేంద్రాల్లో కలర్ కోడ్ సామగ్రిని సక్రమంగా ఉపయోగించాలని సూచించారు. అనంతరం రికార్డులు, ల్యాబ్, లేబర్ గదులను తనిఖీ చేశారు. పరిసరాలు పరిశుభ్రంగా లేని కారణంగానే వ్యాధులు ప్రబలుతున్నాయన్నారు. పరిశుభ్రతపై ప్రజలకు అవగాహన కల్పించాలని ఆదేశించారు. స్వచ్ఛ ఆంధ్ర జిల్లా ఆరోగ్యశాఖ నోడల్ అధికారి టి.జగన్మోహనరావు మాట్లాడుతూ.. జిల్లాలోని 37 పీహెచ్‌సీలు, ఐదు పట్టణ ఆరోగ్య కేంద్రాలు, గ్రామీణ ఆరోగ్య కేంద్రాల పరిధిలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించనున్నామన్నారు. కార్యాలయ వివరాలను పీహెచ్‌సీల ప్రత్యేక యాప్‌లో పొందుపర్చాలన్నారు. అనంతరం వైద్యసిబ్బందితో పరిశుభ్రతపై ప్రత్యేక ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో వైద్యులు ఎం.వినోద్, కె.కార్తీక్, యోగేశ్వరరెడ్డి, సన్యాసిరావు, సూపర్‌వైజర్లు ప్రకాష్, సన్యాసమ్మ, కార్యదర్శి ఆర్.శశిభూషణరావు తదితరులు పాల్గొన్నారు.