Share News

జైవిక్‌ అవార్డు గ్రహీతకు అభినందన

ABN , Publish Date - Jan 25 , 2025 | 12:19 AM

ప్రకృతి వ్యవసా యం చేసి జైవిక్‌ ఇండియా అవార్డు దక్కించుకున్న గిరిజన యువకు డు ఆరిక రవీంద్రను కలెక్టర్‌ ఎ.శ్యాంప్రసాద్‌ శుక్రవారం అభినందించారు.

జైవిక్‌ అవార్డు గ్రహీతకు అభినందన

పార్వతీపురం/ సీతంపేట రూరల్‌, జనవరి 24 (ఆంధ్రజ్యోతి): ప్రకృతి వ్యవసా యం చేసి జైవిక్‌ ఇండియా అవార్డు దక్కించుకున్న గిరిజన యువకు డు ఆరిక రవీంద్రను కలెక్టర్‌ ఎ.శ్యాంప్రసాద్‌ శుక్రవారం అభినందించారు. సీతంపేట మండలం దుగ్గి గ్రామానికి చెందిన ఆరిక రవీంద్ర ప్రకృతి విధానంలో వివిధ పంటలను సాగు చేసినందుకు గాను రాష్ట్ర రైతు సాధికార సంస్థ ఏపీ తరపున ఈ అవార్డుకు ఎంపిక చేసింది. ఈ మేరకు ఐసీసీ ఫర్‌ ఆర్గానిక్‌ అగ్రికల్చర్‌ ద్వారా రవీంద్రకు ఢిల్లీలో ఈనెల 22న అవార్డు ప్రదానం చేశారు. అవార్డు అందుకున్న రవీంద్రను పార్వతీపురం కలెక్టరేట్‌లో కలెక్టర్‌ శ్యాంప్రసాద్‌ సన్మానించారు. గిరిజన యువత వ్యవసాయ రంగంలో రాణిస్తున్న రవీంద్ర ను ఆదర్శంగా తీసుకోవాలని కలెక్టర్‌ అన్నారు. ఆయనతో పాటు డీపీఎం పి.షణ్ముఖరాజు, ఎన్‌ఎఫ్‌ఏ వై.తిరుపతిరావు పాల్గొన్నారు.

Updated Date - Jan 25 , 2025 | 12:19 AM