Share News

విజయనగరంలో ప్రజా మరుగుదొడ్ల కూల్చివేత

ABN , Publish Date - Jan 12 , 2025 | 11:33 PM

విజ యనగరంలోని 40వ డివిజ న్‌లో పరిధిలోగల పోలయ్యపే టలో నిర్మిస్తున్న ఓ అపార్ట్‌ మెంట్‌ ఎదురుగా ఉన్న నగర పాలక సంస్థకు సంబంధించి ప్రజా మరుగుదొడ్లను శుక్రవా రం అర్ధరాత్రి యంత్రాలతో కూల్చివేశారు. మరుగుదొడ్ల స్థలంలో ఉన్న గుంతలను కప్పివేయడంతోపాటు శిథిలాలు, చెట్లను తొలగించి చదునుచేశారు.

విజయనగరంలో ప్రజా మరుగుదొడ్ల కూల్చివేత
మరుగుదొడ్లను తొలగించిన స్థలాన్ని పరిశీలిస్తున్న కమిషనర్‌ నల్లనయ్య :

విజయనగరం రింగురోడ్డు, జనవరి 12(ఆంధ్రజ్యోతి): విజ యనగరంలోని 40వ డివిజ న్‌లో పరిధిలోగల పోలయ్యపే టలో నిర్మిస్తున్న ఓ అపార్ట్‌ మెంట్‌ ఎదురుగా ఉన్న నగర పాలక సంస్థకు సంబంధించి ప్రజా మరుగుదొడ్లను శుక్రవా రం అర్ధరాత్రి యంత్రాలతో కూల్చివేశారు. మరుగుదొడ్ల స్థలంలో ఉన్న గుంతలను కప్పివేయడంతోపాటు శిథిలాలు, చెట్లను తొలగించి చదునుచేశారు. మరుగు దొడ్ల కూల్చివేతలో భవనానికి సంబంధించి బిల్డర్‌, ప్రతిపక్షపార్టీకి చెందిన ఇద్దరు కార్పొరేటర్ల హస్తం ఉందని శనివారం స్థానికులు కమిషనర్‌ పి.నల్లన య్యకు ఫిర్యాదుచేశారు. దీంతో కమిషనర్‌ నల్లనయ్య అధికారులతో కలిసి ఆ ప్రాంతాన్ని పరిశీలించారు. సమీపంలోని అపార్ట్‌మెంట్‌ భవన నిర్మాణదారులకు ఈఘటనలో కీలకపాత్ర ఉందని ప్రాఽథమికంగా గుర్తించారు. ఈమేరకు ఏఎల్‌ ఫలేష్‌, సత్య వెంచర్స్‌ అండ్‌ కనస్ట్రక్టర్స్‌, ఎస్‌ఎస్‌ ట్రేడర్స్‌, ఎంబీవీ వెంచర్స్‌, నెక్స్‌జెన్‌ వెంచర్స్‌ నిర్వాహకులపై విచారణచేపట్టనున్నట్లు కమిషనర్‌ తెలిపారు. ఈవిషయంపై పోలీసుస్టేషన్‌కు ఫిర్యాదు చేసినట్లు చెప్పారు. నగరపాలక సంస్థ ఆస్థులు ఎవరైనా విధ్వంసం చేస్తే ఊపేక్షించబోమని వారిపై చట్టపర మైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కమిషనర్‌ వెంట డీఈ మణి కుమార్‌, సిబ్బంది ఉన్నారు.

Updated Date - Jan 12 , 2025 | 11:33 PM