Share News

Negligence in Medical Services! అంబులెన్స్‌లో ప్రసవం.. వైద్య సేవల్లో నిర్లక్ష్యం!

ABN , Publish Date - Feb 08 , 2025 | 11:33 PM

Childbirth in an Ambulance... Negligence in Medical Services!" సీతంపేట మన్యంలో గిరిజన గర్భిణుల ప్రాణాలు గాలిలో దీపంలా మారాయి. తరచూ గిరిజన గర్భిణులు 108, ఐటీడీఏ అంబులెన్స్‌ల్లో ప్రసవి స్తున్నా.. పట్టించుకునే వారే కరువయ్యారు.

 Negligence in Medical Services! అంబులెన్స్‌లో ప్రసవం.. వైద్య సేవల్లో నిర్లక్ష్యం!

ఆ తర్వాత ఆసుపత్రిలో చేరిన వైనం

సీతంపేట ‘మన్యం’లో తరచూ ఇటువంటి ఘటనలు పునరావృతం

పట్టించుకునే వారే కరువు

సీతంపేట రూరల్‌, ఫిబ్రవరి 8(ఆంధ్రజ్యోతి): సీతంపేట మన్యంలో గిరిజన గర్భిణుల ప్రాణాలు గాలిలో దీపంలా మారాయి. తరచూ గిరిజన గర్భిణులు 108, ఐటీడీఏ అంబులెన్స్‌ల్లో ప్రసవి స్తున్నా.. పట్టించుకునే వారే కరువయ్యారు. శనివారం లాడ పెద్దగూడ గిరిశిఖర గ్రామానికి చెందిన ఆరిక సులోచన అనే గర్భిణీకి పురిటినొప్పులు వచ్చాయి. దీంతో భర్త గంగారావు ఐటీడీఏ మెడికల్‌ సెల్‌కు సమాచారం అందజేశాడు. 20 నిమిషాల తర్వాత ఐటీడీఏ అంబులెన్స్‌ ఆ గ్రామానికి చేరుకుంది. దీంతో ఆశావర్కర్‌ సాయంతో గర్భిణిని వాహనంలో సీతంపేట ఏరియా ఆసుపత్రికి తరలిస్తుండగా.. మార్గమధ్యలో ప్రసవించింది. దీంతో మెరుగైన వైద్యం కోసం హుటాహుటిన ఆమెను సీతంపేట ఏరియా ఆసుపత్రికి వెళ్లినా.. సకాలంలో వైద్యసేవలు అందలేదు. సుమారు 20 నిమిషాల వరకు ఏరియా ఆసుపత్రి వైద్య సిబ్బంది అందుబాటులోకి రాలేదు. దీంతో తల్లీబిడ్డ ఐటీడీఏ అంబులెన్స్‌లోనే చాలా సేపు ఉండిపోయారు. ఆ తర్వాత ఏఎన్‌ఎం వచ్చి తల్లీబిడ్డను ఆసుపత్రిలో చేర్పించింది. వాస్తవంగా గిరిజన గర్భిణులను ముందస్తుగా వసతిగృహం, సమీపంలోని పీహెచ్‌సీలకు తరలించాల్సి ఉంది. అయితే వైద్య సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరించడం వల్లే ఇటువంటి సంఘటనలు పునరావృతమవుతున్నాయనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. దీనిపై ఉన్నతాధికారులు స్పందించాలని గిరిజనులు కోరుతున్నారు. ‘ఐటీడీఏ అంబులెన్స్‌లో ప్రసవించి ఏరియా ఆసుపత్రికి వచ్చిన ఆమెకు వైద్య సిబ్బంది సకాలంలోనే వైద్య సేవలు అందించారు. ప్రస్తుతం తల్లీబిడ్డ క్షేమంగానే ఉన్నారు.’ అని ఆసుపత్రి సూపరింటెండెంట్‌ బి.శ్రీనివాసరావు తెలిపారు.

Updated Date - Feb 08 , 2025 | 11:33 PM