Share News

వల్లంపూడిలో ఎడ్ల బండ్ల పోటీలు

ABN , Publish Date - Jan 25 , 2025 | 11:54 PM

:మండలంలోని వల్లంపూడిలో సాంబమూర్తి తీర్ధమహోత్సవం శుక్ర, శనివారాల్లో నిర్వహించారు. ఈ సందర్భంగా వల్లంపూడి, వేపాడ గ్రామస్థులు ప్రత్యేక మొక్కులు చెల్లించారు.

వల్లంపూడిలో ఎడ్ల బండ్ల పోటీలు
పోటీలో పరుగుతీస్తున్న ఎడ్లబండి

వేపాడ, జనవరి 25 (ఆంధ్రజ్యోతి):మండలంలోని వల్లంపూడిలో సాంబమూర్తి తీర్ధమహోత్సవం శుక్ర, శనివారాల్లో నిర్వహించారు. ఈ సందర్భంగా వల్లంపూడి, వేపాడ గ్రామస్థులు ప్రత్యేక మొక్కులు చెల్లించారు. శని వారం సాయంత్రం ఎడ్ల పరు గు ప్రదర్శన నిర్వహించారు. పోటీల్లో 16 ఎడ్లబండ్లు పాల్గొనగా నిర్వాహకులు విజేతలకు నగదుబహు మతులను అందజేశారు. కార్యక్రమంలో సర్పంచ్‌ రుద్ర అంజలి, రుద్ర వెంకటరావు పాల్గొన్నారు.

నేటి నుంచి మరిడిమాంబ తీర్ధమహోత్సవం

మరిడిమాంబ అమ్మవారి తీర్ధమహోత్సవం ఆది, సోమ ,మంగళవారాల్లో నిర్వ హించనున్నట్లు సర్పంచ్‌ బల్లంకి వరలక్ష్మి శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. బల్లంకి, బానాది, ఎం.సింగవరం, నీలకంఠరాజపురం ,పెదగుడిపాల, భర్తవానిపాలెం, చినగుడిపాల, బీటీకేరాజపురం, తదితర తొమ్మిది గ్రామాల ప్రజలు మరిడిమాంబ అమ్మవారి తీర్ధమహోత్సవం నిర్వహిస్తారు. ఈ సందర్భంగా మూడు రోజులు పాటు బండ్ల వేషాలు, డ్యాన్స్‌ బేబీ డ్యాన్స్‌లు,రేళారే రేలా కార్యక్రమాలు, గయోపాఖ్యానం యుద్ద సీను, 27న బుర్రకఽథ, విశాఖనాయుడు ఈవెంట్స్‌ వారితో డ్యాన్స్‌ బేబీ డ్యాన్స్‌, 28న ఎడ్ల పరుగు ప్రదర్శన నిర్వహించనున్నారు.

Updated Date - Jan 25 , 2025 | 11:54 PM