Share News

కారు, బైక్‌ ఢీ: యువతి మృతి

ABN , Publish Date - Feb 03 , 2025 | 12:31 AM

మండలంలోని పోలిపల్లి సమీపంలో జాతీయ రహదారిపై ఆదివారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో అనకాపల్లి జిల్లా దేవరాపల్లికి చెందిన రొంగలి లీల (23) మృతి చెందారు.

కారు, బైక్‌ ఢీ: యువతి మృతి
లీల (ఫైల్‌)

భోగాపురం, ఫిబ్రవరి2 (ఆంధ్రజ్యోతి): మండలంలోని పోలిపల్లి సమీపంలో జాతీయ రహదారిపై ఆదివారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో అనకాపల్లి జిల్లా దేవరాపల్లికి చెందిన రొంగలి లీల (23) మృతి చెందారు. ఈ ప్రమాదంతో పూసపాటిరేగ మండలం కోనాడ గ్రామానికి చెందిన అడపాక శివగణేష్‌ తీవ్ర గాయాలపాలయ్యారు. పోలీసులు, కుటుంబ సభ్యులు అందించిన వివరాలు ప్రకా రం మండలంలోని ముంజేరు సమీపంలో సాఫ్ట్‌వేర్‌ సంస్థ లో పనిచేస్తున్న ఆరుగురు స్నేహితులు ఆదివారం రాత్రి మూడు ద్విచక్ర వాహనాలపై శ్రీకాకుళం వైపు నుంచి విశాఖపట్నం వైపు వెళ్ల్లే జాతీయ రహదారిపై తగరపువలస వైపు వెళ్తున్నారు. అయితే పోలిపల్లి, అవనం జంక్షన్‌ మధ్య జాతీయ రహదారిపైకి వచ్చే సరికి అదే రహదారిలో శ్రీకాకుళం నుంచి విశాఖపట్నం వైపు వెళ్తున్న కారు ఒక ద్విచక్ర వాహనాన్ని వెనుక నుంచి ఢీకొట్టింది. దీంతో ద్విచక్రవాహనం వెనుక కూర్చున్న రొంగలి లీల రోడ్డుపై పడింది. దీంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. ప్రమాదంలో ఎ.శివ గణేష్‌కు తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రుడిని తగరపువలసలోని ప్రైవేట్‌ ఆసు పత్రికి తరలించారు. అతడి పరిస్థితి విషమంగా ఉంది. లీల రెండేళ్ల నుంచి సాఫ్ట్‌వేర్‌ సంస్థలో పనిచేస్తోంది. ఆమెకు రొంగలి లక్ష్మి, పెద్దినాయుడు తల్లిదం డ్రులతో పాటు చెల్లెలు ఉంది. మృతురాలు తల్లిదండ్రులు వ్యవసాయ కూలీలు. కుమార్తె మృతి చెందిన విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు గుండెలవిసేలా రోదించారు. ఈ ఘటనపై సీఐ ప్రభాకర్‌ కేసు నమోదు చేశారు.

Updated Date - Feb 03 , 2025 | 12:31 AM