నిర్మించారు.. నిర్వహణ మరిచారు
ABN , Publish Date - Jan 16 , 2025 | 12:27 AM
పార్వతీపురంలో పేద, మధ్యతరగతి కుటుం బాల వివాహాలు తక్కువ ఖర్చుతో నిర్వహిం చుకోవాలని ఆశయంతోనిర్మించిన కల్యాణ మం డపం ఆశయం నీరుగారుతోంది. ప్రధానంగా కోట్లాది రూపాయలతో నిర్మించినా అధికారులు నిర్వహణను గాలి కొదిలేశారు. సమీపంలో డంపింగ్‌యార్డు ఉండడం వల్లే నిరుపయో గంగా మారిందని స్థానికులు చెబుతున్నారు.

పార్వతీపురంటౌన్,జనవరి15(ఆంధ్రజ్యోతి): పార్వతీపురంలో పేద, మధ్యతరగతి కుటుం బాల వివాహాలు తక్కువ ఖర్చుతో నిర్వహిం చుకోవాలని ఆశయంతోనిర్మించిన కల్యాణ మం డపం ఆశయం నీరుగారుతోంది. ప్రధానంగా కోట్లాది రూపాయలతో నిర్మించినా అధికారులు నిర్వహణను గాలి కొదిలేశారు. సమీపంలో డంపింగ్‌యార్డు ఉండడం వల్లే నిరుపయో గంగా మారిందని స్థానికులు చెబుతున్నారు.
పేద కుటుంబాలు తక్కువ ఖర్చుతో ప్రశాం తంగా శుభకార్యక్రమాలు నిర్వహించుకోవాల ని భావించి టీడీపీ ప్రభుత్వ హయాంలో 2016-17లో పట్టణ శివారుల్లో దాతల సహకా రంతో తిరుమల తిరుపతి దేవస్థానం కల్యాణ మండపం నిర్మించారు. అప్పటి మాజీ వైస్ చైర్మన్ బెలగాం జయప్రకాష్ నారాయణ, పట్టణానికి చెందిన మరికొంతమంది నిర్మా ణా నికి చర్యలు తీసుకున్నారు. టీడీపీ నాయకులు, మాజీ ఎమ్మెల్సీ జగదీష్, మాజీ ఎమ్మెల్యే బొబ్బిలి చిరంజీవులు టీడీడీ కల్యాణ మండప ప్రారంభించిన విషయం విదితమే. సుమారు రూ.1.20 కోట్లతో కల్యాణ మండప నిర్మించినా ఇప్పటివరకు ఒకే ఒక్క వివాహం జరగడం విశేషం. కొవిడ్ సమయంలో పునరావాస కేం ద్రంగా వినియోగించిన విషయం విదితమే. సమీపంలో డంపింగ్‌యార్డు ఏర్పాటుచేయడం వల్ల టీడీపీ కల్యాణ మండపంలో ఏ ఒక్కరూ శుభ కార్యక్రమాల నిర్వహణకు ముందుకురా వడంలేదని పలువురు చెబుతున్నారు. తక్షణమే డంపింగ్ యార్డు తరలించి టీటీడీ కల్యాణ మండపానికి పూర్వ వైభవాన్ని తీసుకురావాలని పట్టణ వాసులు కోరుతున్నారు.