Share News

నిర్మించారు.. వదిలేశారు

ABN , Publish Date - Jan 16 , 2025 | 12:29 AM

మండలంలోని ధర్మవరం ఎస్సీ బాలుర వసతిగృహం నిరుపయోగంగా మారింది. గత ప్రభుత్వంహయాంలో విద్యార్థుల సంఖ్య తక్కువ గా ఉందన్న కారణంతో 2006 రూ.కోటి 50 లక్షలతో నిర్మించిన భవనం వృథాగా వదిలేశారు.

 నిర్మించారు.. వదిలేశారు
నిరుపయోగంగా ఉన్న ధర్మవరం ఎస్సీ వసతిగృహం:

శృంగవరపుకోట రూరల్‌, జనవరి 15(ఆంధ్ర జ్యోతి): మండలంలోని ధర్మవరం ఎస్సీ బాలుర వసతిగృహం నిరుపయోగంగా మారింది. గత ప్రభుత్వంహయాంలో విద్యార్థుల సంఖ్య తక్కువ గా ఉందన్న కారణంతో 2006 రూ.కోటి 50 లక్షలతో నిర్మించిన భవనం వృథాగా వదిలేశారు. దీంతో ఇది అసాంఘిక కార్యకలపాలకు నిలయం గా మారింది.రాత్రి, పగలు తేడాలేకుండా మందు బాబులు, పేకాటరాయుళ్లతోపాటు ఇతర అసాం ఘిక కార్యకలాపాలు, బహిరంగ మలవిసర్జనకు వినియో గిస్తున్నారు. అప్పటినుంచి ఇది నిరుప యోగంగా మారింది. పటిష్ఠంగా ఉన్న ఈ భవ నంప్రభుత్వ కార్యాలయాలు,గ్రామసచివా లయం, అంగన్‌ వాడీల సేవలకు వినియోగించుకోవాలని పలువురు సూచిస్తున్నారు. కొద్దిపాటి మరమ్మ తులు చేయించి, చుట్టూ పెరిగిన తొలగించాలని పలు వురు కోరుతున్నారు. ఇప్పటికే ధర్మవరం పంచా యతీ సచివాలయం ఇరుకు గదుల్లో నిర్వహిస్తుం డడంతో తక్షణమే ఇక్కడకు తరలించాలని పలు వురు సూచిస్తున్నారు.

Updated Date - Jan 16 , 2025 | 12:29 AM