Share News

రెవెన్యూ సమస్యల పరిష్కారంలో బొబ్బిలికి రెండో స్థానం

ABN , Publish Date - Feb 14 , 2025 | 12:21 AM

రెవెన్యూ సమస్యల పరిష్కా రంలో బొబ్బిలి రెండో స్థానం దక్కించుకుందని ఆర్డీవో జేవీఎస్‌ ఎస్‌ రామ్మోహనరావు తెలిపారు.

రెవెన్యూ సమస్యల పరిష్కారంలో బొబ్బిలికి రెండో స్థానం

బొబ్బిలి, ఫిబ్రవరి 13 (ఆంధ్రజ్యో తి): రెవెన్యూ సమస్యల పరిష్కా రంలో బొబ్బిలి రెండో స్థానం దక్కించుకుందని ఆర్డీవో జేవీఎస్‌ ఎస్‌ రామ్మోహనరావు తెలిపారు. గురువారం ఆయన బొబ్బిలిలోని తన కార్యాలయంలో విలేకర్లతో మాట్లాడా రు. డివిజన్‌ పరిధిలో 1642 దరఖా స్తులు రాగా అందులో 1610 పరిష్కరించగా, 34 పెండింగ్‌లో ఉన్నాయ న్నారు. గ్రామసభలలో బాడంగిలో 230కి గాను 224, బొబ్బిలిలో 1072 (1146), దత్తిరాజేరులో 239 (232), మెంటాడలో 182 (140), గజపతిన గరంలో 302 (269), రామభద్రపురం మండలంలో 1852, తెర్లాం మండలంలో దరఖాస్తులు 853 (పరిష్కరించినవి -812) అని తెలిపారు. ఫ రెవెన్యూ డివిజన్‌ పరిధిలో గత ప్రభుత్వ హయాంలో మొత్తం 86 ఇళ్ల స్థలాల లేఅవుట్లలో 5,726 ఇళ్ల స్థలాలు ప్లాట్లు వేశార న్నారు. 3,809 ఇళ్లు మంజూరయ్యాయని తెలిపారు. 283 ఇళ్లు ప్రారంభం కాలేదని, మిగిలిన వి వివిధ దశలలో ఉన్నాయన్నారు. 2,101 ఇళ్లు పను లు ప్రారంభించ కపోవడంతో ఆ పట్టాలను రద్దు చేస్తున్నారని ఆయన తెలిపారు.

సర్వే రాళ్లపై జగన్‌ బొమ్మలు తొలగిస్తున్నాం

బొబ్బిలి డివిజన్‌ పరిధిలో మొత్తం అన్ని మండలాల్లో 2,57,063 సర్వే రాళ్లు గత ప్రభుత్వ హయాంలో ఏర్పాటు చేశారన్నారు. వాటిపై ఉన్న మాజీ ముఖ్యమంత్రి జగన్‌ బొమ్మలను తొలగించే పనులు జరుగుతున్నా యన్నారు. ఇంతవరకు రెండు లక్షలకు పైగా సర్వేరాళ్లపై బొమ్మలు తొలగించామని చెప్పారు. ఇందుకు సంబంధించి బిల్లుల చెల్లింపు కూడా జరిగిపోయిందని ఆర్డీవో తెలిపారు.

Updated Date - Feb 14 , 2025 | 12:21 AM