Share News

అభివృద్ధిని అడ్డుకుంటే సహించేది లేదు

ABN , Publish Date - Jan 07 , 2025 | 12:22 AM

అభివృ ద్ధిని అడ్డుకుంటే సహించే ప్రసక్తే లేదని రాష్ట్ర మహిళా శిశు సంక్షేమ, గిరిజన సంక్షేమ శాఖా మంత్రి గుమ్మిడి సంధ్యారాణి హెచ్చరించారు.

అభివృద్ధిని అడ్డుకుంటే సహించేది లేదు

  • ఘనంగా రహదారుల ప్రారంభోత్సవం

మక్కువ/సాలూరు, జనవరి 6(ఆంధ్రజ్యోతి): అభివృ ద్ధిని అడ్డుకుంటే సహించే ప్రసక్తే లేదని రాష్ట్ర మహిళా శిశు సంక్షేమ, గిరిజన సంక్షేమ శాఖా మంత్రి గుమ్మిడి సంధ్యారాణి హెచ్చరించారు. మక్కువ మండలం కాశీప ట్నం గ్రామంలో సోమవారం జరిగిన వంద రహదారుల ప్రారంభోత్సవంలో ఆమె పాల్గొన్నారు. అనంతరం ఆమె మాట్లాడారు. కూటమి ప్రభుత్వం సెప్టెంబరు నెలలో పల్లె పండగ కార్యక్రమం నిర్వహించి కేవలం వంద రోజుల కాల వ్యవధిలోనే నియోజకవర్గంలో వంద రోడ్లు పూర్తి చేసిందని గుర్తు చేశారు. మక్కువ మండలంలో ఆరు నెలల కాలంలో రూ.14కోట్లతో వివిధ అభివృద్ధి పనులు పూర్తి చేశామని తెలిపారు.

అధికారులు భయపడొద్దు

మక్కువ గ్రామంలో 11 రోడ్లు మంజురు చేస్తే కేవలం ఒకే ఒక్క రోడ్డు పూర్తి చేశారని మంత్రి తెలిపారు. రోడ్డు నిర్మాణంలో అడ్డుపడితే సహించేది లేదని హెచ్చరించారు. ఒకటి రెండు సార్లు ఊరుకుంటానని, మూడో సారి నేరు గా ఆ గ్రామానికి వెళ్లి రోడ్డు వేస్తానని చెప్పారు. ఒక ఎమ్మెల్యేగా, మంత్రిగా తనకు ఆ అధికారం ఉందని అన్నారు. అభివృద్ధి విషయంలో అధికారులు భయపడే ప్రసక్తి వద్దని, ఎలాంటి అనుమతులు కావాలన్నా ఇస్తాన ని హామీ ఇచ్చారు. ఏ పార్టీ నాయకులు ముందుకు వచ్చినా పనులు ఇవ్వటానికి తాను సిద్ధమన్నారు.

త్వరలో జిల్లాలో 63 అంగన్‌వాడీ పోస్టులు రానున్నాయని తెలిపారు. పాఠశాలలు ఆరంభం కాగానే తల్లికి వందనం డబ్బులు తల్లులు ఖాతాలో జమ కానున్నాయని చెప్పారు. రాష్ట్రంలో మొట్టమొదటి సారిగా వంద రోడ్లు నిర్మాణం పూర్తి చేసుకున్న ఏకైక నియోజక వర్గం సాలూరు అని అన్నారు. ధాన్యం అమ్మిన రైతుకు నాలుగైదు గంటల్లో వారి ఖాతాలో డబ్బులు జమ అవుతున్నాయని తెలిపారు. సైకో ప్రభుత్వంలో ఆ విధానం లేదని కేవలం ఆ ముఖ్యమంత్రి ఎవ్వరితో మాట్లాడేవాడే కాదని విమర్శించారు.

గుడ్లా.. గోళీలా?

అనంతరం ఆమె కస్తూర్బా ఆశ్రమ పాఠశాలను తనిఖీ చేశారు. విద్యార్థుల విద్యా సామర్థ్యాలను అడిగి తెలుసు కున్నారు. మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించారు. అత్యంత చిన్న పరిమాణంలో ఉన్న కోడి గుడ్డును చూసి ఆమె ఆశ్చ ర్యం వ్యక్తం చేశారు. గుడ్లా.. గోళీలా అన్ని ప్రశ్నించారు. ఈ విషయాన్ని చాలా సార్లు అధికారులకు తెలిపినా ఎవరూ పట్టించుకోలేదని సిబ్బంది, ప్రిన్సిపాల్‌, అంగన్‌వాడీ కార్యకర్తలు చెప్పారు. వెంటనే దీనిపై చర్యలు తీసుకుంటా నని ఆమె హామీ ఇచ్చారు. కార్యక్రమంలో టీడీపీ మండల అధ్యక్షుడు వేణుగోపాలనాయుడు, నిమాది తిరుపతిరావు, కోట జయ, సూరపాటి చంద్రరావు, డాక్టర్‌ మల్లేశ్వరరావు, గౌరీశంకరరావు తదితరులు పాల్గొన్నారు.

రూ.300కోట్లతో అభివృద్ధి పనులు

సాలూరు రూరల్‌, జనవరి 6 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో గిరిజనాభివృద్ధి కోసం ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రధాని మోదీని ఒప్పించి, కేంద్రం నుంచి రూ.300 కోట్లు తెప్పించి అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారని మంత్రి గుమ్మిడి సంధ్యారాణి తెలిపారు. సాలూరు మండలం తోణాంలో రూ.6లక్షలతో నిర్మించిన సీసీ రోడ్డును ఆమె సోమవారం ప్రారంభించారు. ఈసందర్భంగా జరిగిన సమావేశంలో ఆమె మాట్లాడారు. రాష్ట్రంలో రూ.300కోట్లుతో అభివృద్ధి పనులు చేపడితే అందులో రూ.80కోట్లతో సాలూరు నియోజకవర్గంలో పనులు జరుగుతున్నాయన్నారు. పల్లె పండగ కార్యక్రమంలోలో పనులు ప్రారంభించి వంద రోజులు పూర్తి కాకుండానే సాలూరు నియోజకవర్గంలో రూ.5కోట్లుతో 102 రోడ్లు పూర్తి చేసి ప్రారంభించుకుంటు న్నామని ఆమె తెలిపారు. తోణాం గ్రామంలో మంత్రికి ఘన స్వాగతం లభించింది. పార్టీ నాయకులు, కార్యకర్తలు ఆమెకు గజమాల వేసి, స్వాగతం పలికారు. కోలాటం ఆడుతున్న మహిళలతో కలిసి ఆమె కోలాటం ఆడారు. టీడీపీ సాలూరు మండల అధ్యక్షుడు ఆముదాల పరమేశు, నిమ్మాది చిట్టి, మత్స శ్యాం, బూస తవుడు, రంభ రజని, వెంకటేష్‌, చైతన్య తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Jan 07 , 2025 | 12:22 AM