ఆటో బోల్తా: వ్యక్తి మృతి
ABN , Publish Date - Feb 14 , 2025 | 12:30 AM
విజయనగరం రూరల్ పరిధిలో చెల్లూరు గ్రామ సమీపంలో కోరాడపేట వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒక వ్యక్తి మృతి చెందాడు.

విజయనగరం క్రైం/దత్తిరాజేరు ఫిబ్రవరి 13 (ఆంధ్రజ్యోతి): విజయనగరం రూరల్ పరిధిలో చెల్లూరు గ్రామ సమీపంలో కోరాడపేట వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒక వ్యక్తి మృతి చెందాడు. మరో ముగ్గురు స్వల్పగాయాలు పాల య్యారు. పోలీసులు అందించిన వివరాలు ప్రకారం.. దత్తిరాజేరు మండలం వింధ్యావాసి గ్రామానికి చెందిన ఆటో డ్రైవర్ టి.సూర్యనారాయణ తన ఆటోలో అదే గ్రామానికి చెందిన బాషా, సన్యాసినాయుడు, షేక్ బాబీలతో కలిసి గురు వారం విశాఖ వెళ్లారు. అక్కడ వారి పని ముగించుకుని తిరిగి రాత్రి స్వగ్రా మానికి వస్తుండగా చెల్లూరు సమీపంలో కోరాడపేట బ్రిడ్జి వద్ద ఆటో టైర్ పంచర్ కావడంతో ఆటో అదుపు తప్పి బోల్తా పడి డివైడర్ ఢీకొనడంతో ప్ర మాదం జరిగింది. ఈ ఘటనలో డ్రైవర్ సూర్యనాయణ తలకు బలమైన గా యాలు కావడం వల్ల అక్కడక్కడే మృతి చెందారు. ఆటోలో ఉన్న మిగిలిన ముగ్గురికి స్వల్పగాయాలయ్యాయి. సమాచారం తెలుసుకున్న విజయనగరం రూరల్ ఎస్‌ఐ అశోక్ ఘటనా స్ధలానికి వెళ్లి పరిశీలించారు. మృతదేహాన్ని పో స్టుమార్టం నిమిత్తం జిల్లా కేంద్ర ఆసుపత్రికి తరలించారు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేశారు. మృతుడు సూర్యనారాయణకు భార్య స్వాతి, ముగ్గురు కుమారులు ఉన్నారు.