గిరిజనులపై దౌర్జన్యం ఆపాలి
ABN , Publish Date - Feb 09 , 2025 | 11:29 PM
గిరిజనులపై ఒడిశా ప్రభుత్వం దౌర్జన్యం ఆపాలని ఆదివాసీ గిరిజన సంఘం మండల కమిటీ కార్యదర్శి గెమ్మెల జానకి డిమాండ్ చేశారు.

సాలూరు, ఫిబ్రవరి 9 (ఆంధ్ర జ్యోతి): గిరిజనులపై ఒడిశా ప్రభుత్వం దౌర్జన్యం ఆపాలని ఆదివాసీ గిరిజన సంఘం మండల కమిటీ కార్యదర్శి గెమ్మెల జానకి డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆదివారం దులిభద్ర గ్రామంలో నిరసన చేపట్టారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ కొఠియా సరిహద్దు గ్రామాల గిరిజనులపై ఒడిశా ప్రభుత్వం వేధింపులకు దిగడం సరికాదన్నారు. అభివృద్ధి పనులు సామగ్రిని తీసుకుని వెళ్లడం, గిరిజన కూలీలను నిర్బంధించటం సరికాదని అన్నారు. వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సహాయ కార్యదర్శి మర్రి శ్రీనివాసరావు, ఆదివాసీ గిరిజన సంఘం నాయకు లు తొడంగి సన్నం, చోడిపల్లి రాజు, సుబ్బారావు, బిరుసు పాల్గొన్నారు.