రైతు వ్యతిరేక విధానాలు తగవు
ABN , Publish Date - Jan 27 , 2025 | 01:14 AM
కేంద్ర ప్రభుత్వం రైతు వ్యతిరేక విధానాలను విడనాడాలని ఏపీ రైతు కార్మిక సంఘాల సమన్వయ సమితి ఆధ్వర్యంలో ఆదివారం నిరసన ర్యాలీ నిర్వహించారు.
పాలకొండ, జనవరి 26 (ఆంధ్రజ్యోతి): కేంద్ర ప్రభుత్వం రైతు వ్యతిరేక విధానాలను విడనాడాలని ఏపీ రైతు కార్మిక సంఘాల సమన్వయ సమితి ఆధ్వర్యంలో ఆదివారం నిరసన ర్యాలీ నిర్వహించారు. పాలకొండ కోటదుర్గమ్మ అమ్మవారి ఆలయ జంక్షన్ నుంచి మెయిన్‌రోడ్డు మీదుగా ఆర్టీసీ కాంప్లెక్స్ వరకు ర్యాలీ నిర్వహించారు. ఈసందర్భంగా ఏపీ రైతు సంఘం పార్వతీపురం మన్యం జిల్లా అధ్యక్షుడు ఎం.కృష్ణమూర్తి, సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు దావాల రమణారావు, గిరిజన సంఘం జిల్లా నాయకుడు ఎం.తిరుపతిరావు, అభ్యుదయ రైతు ఖండాపు ప్రసాదరావు మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం రైతులకు సంబంధించిన నూతన చట్టాలను రద్దు చేయాలన్నారు. కార్మిక, ప్రజా వ్యతిరేక విధానాలను వ్యతిరేకించి ఐక్య పోరాటాలు తీవ్రతరం చేయాలని పిలుపునిచ్చారు. నాలుగు లేబర్ కోడ్లును రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో రైతు కార్మిక సంఘాల నాయకులు చిట్టిబాబు, జి.కృష్ణ, ఎం.అప్పన్న, కె.రాము, డి.దుర్గారావు, వీరన్నాయుడు, భానుచందర్, శ్రీనివాస రావు, సంజీవి తదితరులు పాల్గొన్నారు.