Share News

Announced ప్రకటించారు.. మరిచారు!

ABN , Publish Date - Jan 07 , 2025 | 12:17 AM

Announced... But Forgotten పార్వతీపురం మన్యం జిల్లాకు వైద్య కళాశాల మంజూరు చేస్తున్నట్లు హడావుడి చేసిన గత వైసీపీ ప్రభుత్వం ప్రకటనలకే పరిమితమైంది. త్వరలోనే పనులు ప్రారంభించినట్లు చెప్పినా.. శంకుస్థాపన కూడా చేయలేదు.

Announced ప్రకటించారు.. మరిచారు!

  • వైద్య కళాశాల ఏర్పాటుకు చర్యలు శూన్యం

  • స్థల పరిశీలనతోనే సరి

  • శంకుస్థాపన కూడా చేయని వైనం

  • కూటమి ప్రభుత్వంపైనే ఆశలు

పార్వతీపురం, జనవరి6 (ఆంధ్రజ్యోతి): పార్వతీపురం మన్యం జిల్లాకు వైద్య కళాశాల మంజూరు చేస్తున్నట్లు హడావుడి చేసిన గత వైసీపీ ప్రభుత్వం ప్రకటనలకే పరిమితమైంది. త్వరలోనే పనులు ప్రారంభించినట్లు చెప్పినా.. శంకుస్థాపన కూడా చేయలేదు. రెండేళ్ల కిందట సీఎం హోదాలో జగన్‌ కురుపాం బహిరంగ సభలో మాట్లాడుతూ.. వైద్య కళాశాలపై హామీ ఇచ్చారు. ఈ ప్రాంత విద్యార్థులకు వైద్య విద్య అందుబాటులోకి వస్తుందని గొప్పలు చెప్పు కున్నారు. అయితే ఆ దిశగా ఎటువంటి చర్యలు తీసుకోలేదు. అప్పట్లో అధికారులు జిల్లా పరిధిలో స్థల పరిశీలన కూడా చేపట్టారు. అయితే ఆ తర్వాత ఎటువంటి పనులు చేపట్టలేదు. పక్కనే ఉన్న విజయనగరం జిల్లాలో ప్రభుత్వ, ప్రైవేట్‌ వైద్య కళాశాలలు ఉన్నాయి. కానీ పార్వతీపురంలో ఒక్క వైద్య కళాశాల కూడా లేకపోవడంతో ఈ ప్రాంత విద్యార్థులకు ఇబ్బందులు తప్పడం లేదు. ఈ క్రమంలో జిల్లావాసులంతా ప్రస్తుతం కూటమి ప్రభుత్వంపైనే ఆశలు పెట్టుకున్నారు. వైద్య కళాశాల ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని వారు కోరుతున్నారు. ఇదిలా ఉండగా జిల్లా పరిధిలో ప్రభుత్వ నర్సింగ్‌ కళాశాల కూడా ఏర్పాటు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. జిల్లా కేంద్ర ఆసుపత్రితో పాటు సాలూరు, పాలకొండ, సీతంపేట ప్రాంతాల్లో ఏరియా ఆసుపత్రులు , సీహెచ్‌సీలు, పీహెచ్‌సీలు ఉన్నాయి. వాటి పరిధిలో రోగులకు మెరుగైన సేవలు అందించేందుకు వైద్య సిబ్బందితో పాటు నర్సింగ్‌ విద్యార్థినులు ఎంతో కీలకం. ఈ నేపథ్యంలో నర్సింగ్‌ కళాశాల ఏర్పాటుపై కూటమి ప్రభుత్వం దృష్టి సారించాల్సి ఉంది.

Updated Date - Jan 07 , 2025 | 12:17 AM