Share News

Agni Gangamma 10 నుంచి అగ్ని గంగమ్మ జాతర

ABN , Publish Date - Feb 17 , 2025 | 11:33 PM

Agni Gangamma Jatara from 10th ఆంధ్రా-ఒడిశా సరిహద్దుల్లో ఉన్న నీలావడి గ్రామంలో వచ్చేనెల 10వ తేదీ నుంచి అగ్ని గంగమ్మ జాతర నిర్వహించనున్నట్టు ఉత్సవ కమిటీ సభ్యులు సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు.

Agni Gangamma  10 నుంచి అగ్ని గంగమ్మ జాతర
అగ్ని గంగమ్మ

పార్వతీపురం రూరల్‌, ఫిబ్రవరి17(ఆంధ్రజ్యోతి): ఆంధ్రా-ఒడిశా సరిహద్దుల్లో ఉన్న నీలావడి గ్రామంలో వచ్చేనెల 10వ తేదీ నుంచి అగ్ని గంగమ్మ జాతర నిర్వహించనున్నట్టు ఉత్సవ కమిటీ సభ్యులు సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ జాతరకు పార్వతీపురంతో పాటు శ్రీకాకుళం జిల్లా నుంచి పెద్దఎత్తున భక్తులు తరలిరానున్నారు. అమ్మవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకోనున్నారు. ఇదిలా ఉండగా భక్తజనం రద్దీ దృష్ట్యా పార్వతీపురం ఆర్టీసీ ఆధ్వర్యంలో నీలావడికి ప్రత్యేకంగా బస్సులు నడపనున్నారు.

Updated Date - Feb 18 , 2025 | 12:15 AM