Share News

P-4 Survey పక్కాగా పీ-4 సర్వే

ABN , Publish Date - Feb 24 , 2025 | 11:50 PM

Accurate P-4 Survey జిల్లాలో పీ-4 విధానంపై పక్కాగా సర్వే చేపట్టాలని కలెక్టర్‌ ఎ.శ్యామ్‌ ప్రసాద్‌ ఆదేశించారు. మార్చి 8 నుంచి 28వ తేదీ వరకు ఈ ప్రక్రియ నిర్వహిం చాలన్నారు. జిల్లాలో 2 లక్షల 65 వేల గృహాలు ఉన్నాయని, వ్యవధి తక్కువగా ఉన్నందున ప్రణాళికాబద్ధంగా సర్వే పూర్తి చేయాలని స్పష్టం చేశారు.

  P-4 Survey  పక్కాగా పీ-4 సర్వే
సమావేశంలో మాట్లాడుతున్న కలెక్టర్‌ శ్యామ్‌ ప్రసాద్‌

  • అధికారులకు కలెక్టర్‌ శ్యామ్‌ప్రసాద్‌ ఆదేశం

పార్వతీపురం, ఫిబ్రవరి 24(ఆంధ్రజ్యోతి): జిల్లాలో పీ-4 విధానంపై పక్కాగా సర్వే చేపట్టాలని కలెక్టర్‌ ఎ.శ్యామ్‌ ప్రసాద్‌ ఆదేశించారు. మార్చి 8 నుంచి 28వ తేదీ వరకు ఈ ప్రక్రియ నిర్వహిం చాలన్నారు. జిల్లాలో 2 లక్షల 65 వేల గృహాలు ఉన్నాయని, వ్యవధి తక్కువగా ఉన్నందున ప్రణాళికాబద్ధంగా సర్వే పూర్తి చేయాలని స్పష్టం చేశారు. సోమవారం కలెక్టరేట్‌లో సంబంధిత అధికారులతో ఆయన మాట్లాడుతూ.. పీ-4 విధానం ద్వారా పేదలకు ఆర్థిక సాధికారిత చేకూర్చాల్సి ఉందన్నారు. జీవన ప్రమాణాల్లో అట్టడుగు స్థాయిలో ఉన్న 20 శాతం మందిని గుర్తించాలని సూచించారు. ప్రభుత్వం సూచించిన ప్రమాణాల మేరకు సర్వే చేపట్టాలన్నారు. ఆ వివరాలను ఆన్‌లైన్‌లో నమోదు చేయాలని ఆదేశించారు. మున్సిపల్‌ కమిషనర్లు, తహసీల్దార్లు, ఎంపీడీవోలు, నియోజకవర్గ మండల ప్రత్యేక అధికారులు చొరవ తీసుకోవాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన వాట్సాప్‌ (95523 00009) గవర్నెన్స్‌పై ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు. సచివాలయాల్లో వాట్సాప్‌ ద్వారా పొందే ప్రభుత్వ సేవలపై బోర్డులను ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ఈ సమావేశంలో ఐటీడీఏ ఇన్‌చార్జి పీవో అశుతోష్‌ శ్రీవాత్తవ, ప్రత్యేక ఉపకలెక్టర్‌ పి.ఽధర్మచంద్రారెడ్డి, జిల్లా వ్యవసాయాధికారి కె.రాబర్ట్‌పాల్‌, పశు సంవర్థక అధికారి ఎస్‌.మన్మథరావు, మున్సిపల్‌ కమిషనర్‌ వెంకటేశ్వర్లు, డీఎంహెచ్‌వో భాస్కరరావు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Feb 24 , 2025 | 11:50 PM