Share News

ఒక టీచర్‌.. ఒక విద్యార్థిని

ABN , Publish Date - Jun 28 , 2025 | 12:35 AM

ఇది భోగాపురం మండలం అమటాంరావివలస పంచాయతీ నారుపేట ప్రభుత్వ పాఠశాల. ఇక్కడ ఒకే ఒక్క విద్యార్థిని చదువుతోంది.

ఒక టీచర్‌.. ఒక విద్యార్థిని

విజయనగరం: ఇది భోగాపురం మండలం అమటాంరావివలస పంచాయతీ నారుపేట ప్రభుత్వ పాఠశాల. ఇక్కడ ఒకే ఒక్క విద్యార్థిని చదువుతోంది. 2వ తరగతికి చెందిన ధనుశ్రీ అనే బాలిక విద్యనభ్యసిస్తోంది. లక్ష్మి అనే ఉపాధ్యాయురాలు ఈ బాలికకు చదువు చెబుతున్నారు. గత ఐదేళ్లుగా ఇద్దరు లేక ముగ్గురు విద్యార్థులతో పాఠశాల నిర్వహిస్తున్నారు. గతేడాది ఇక్కడ 1, 4, 5 తరగతులకు సంబంధించి ముగ్గురు విద్యార్థులు ఉండేవారు.


ఈ ఏడాది ప్రభుత్వం 1, 2 తరగతులకు సంబంధించి ఫౌండేషన్‌ స్కూల్‌గా నిర్వహిస్తోంది. దీంతో ఇక్కడ ఫౌండేషన్‌ స్కూల్‌లో రెండో తరగతికి చెందిన ధనుశ్రీ మాత్రమే ఉంది. ఈ పాఠశాలకు భవనం లేక గ్రామస్థులకు చెందిన ఓ రేకుల షెడ్డులో నిర్వహిస్తున్నారు. దీనిపై ఉపాధ్యాయురాలు లక్ష్మిని వివరణ కోరగా.. ‘ఇక్కడ గతంలో ముగ్గురు విద్యార్థులు ఉండేవారు. ఇప్పుడు ఫౌండేషన్‌ స్కూల్‌ కావడంతో 2వ తరగతికి చెందిన ఒక విద్యార్థిని మాత్రమే ఉంది. కొత్తగా ఎవరూ చేరలేదు’ అని తెలిపారు.


ఇవి కూడా చదవండి

Puri Rath Yatra: జగన్నాథుని రథయాత్రలో అపశృతి.. 500 మందికి పైగా గాయాలు

Phone Tapping: ఆ మెయిలే పట్టిచ్చింది!

Read Latest AP News And Telugu News

Updated Date - Jun 28 , 2025 | 11:06 AM