Share News

రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి

ABN , Publish Date - Jan 31 , 2025 | 12:26 AM

నారుపేట సమీపం జాతీయ రహదారిపై గురువారం జరిగిన రోడ్డు ప్రమాదంలో డెంకాడ మండలం మోదవలస గ్రామానికి చెందిన బోని అప్పలనాయుడు(50) మృతి చెందారు.

  రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి

భోగాపురం, జనవరి30(ఆంధ్రజ్యోతి): నారుపేట సమీపం జాతీయ రహదారిపై గురువారం జరిగిన రోడ్డు ప్రమాదంలో డెంకాడ మండలం మోదవలస గ్రామానికి చెందిన బోని అప్పలనాయుడు(50) మృతి చెందారు. అప్పలరాజు భోగాపురం నుంచి రాజాపులోవ కారులో వెళ్తున్నాడు. అ యితే నారుపేట సమీపంలో ఎదురుగా వస్తున్న జేసీబీని కారు ఢీకొంది. దాంతో అప్పలనాయుడుకు తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రున్ని చికిత్స నిమిత్తం తగర పువలసలోని ఓ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందారు.

Updated Date - Jan 31 , 2025 | 12:26 AM