Share News

killed his wife భార్యను హత్య చేసిన భర్త

ABN , Publish Date - Feb 07 , 2025 | 12:30 AM

భార్యను భర్త హతమార్చిన ఘటన గురువారం దత్తిరాజేరు మండలంలోని చుక్కపేటలో చోటు చేసుకుంది.

killed his wife భార్యను హత్య చేసిన భర్త
తల్లి మృతదేహం వద్ద రోదిస్తున్న కుమారుడు గణేశ్‌

  • పరారీలో నిందితుడు

దత్తిరాజేరు, ఫిబ్రవరి 6 (ఆంధ్ర జ్యోతి): భార్యను భర్త హతమార్చిన ఘటన గురువారం దత్తిరాజేరు మండలంలోని చుక్కపేటలో చోటు చేసుకుంది. స్థానికులు, పోలీసుల కథనం ప్రకారం.. చుక్కపేటకు చెందిన గౌరమ్మ, సత్యం ఇద్దరూ భార్యాభర్తలు. సత్యం రోజూ తాగి వచ్చి భార్యతో గొడవ పడుతుండే వాడు. అప్పుడప్పుడు కొడుతూ ఉండేవాడు. ఏరోజైనా మారకపో తాడా అనే ఆశతో భర్త వేధింపు లను ఆమె భరించేది. ఎప్పటిలాగే మూడురోజుల కిందట కూడా భార్యతో సత్యం గొడవకు దిగాడు. కాగా గురువారం రోజూ మాదిరిగానే గౌరమ్మ.. చుక్కపేట పక్క గ్రామం గుచ్చిమి సమీపంలో వరి పిలకలు కోయడానికి పనికి వెళుతుండగా ఆయిల్‌ ఫామ్‌ తోట వద్ద కాపు కాసిన భర్త వెనుక నుంచి వచ్చి ఆమెపై కొడవలితో దాడి చేశాడు. దాంతో ఆమె అక్కడికక్కడే మృతి చెం దింది. భర్త సత్యం అక్కడి నుంచి పరారయ్యాడు. విషయం తెలుసుకున్న సీఐ వెంకటరమణ, పెదమానాపురం స్టేషన్‌ ఎస్‌ఐ ఆర్‌.జయంతి ఘటనా స్థలా నికి చేరుకుని విచారణ చేశారు. క్లూస్‌ టీమ్‌ వివరాలు సేకరించింది. మృతు రాలు గౌరమ్మకు వివాహితులైన కుమారుడు గణేశ్‌, కుమార్తె భవాని ఉన్నారు. గౌరమ్మ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం విజయనగరం ప్రభుత్వ ఆసుప త్రికి తరలించారు.

Updated Date - Feb 07 , 2025 | 12:30 AM