టీడీపీలోకి 60 కుటుంబాలు
ABN , Publish Date - Feb 12 , 2025 | 12:04 AM
బొబ్బిలి మండలం రాముడువలస గ్రామం ఎస్సీ కాలనీకి చెందిన 60 కుటుంబాలు వైసీపీని వీడి టీడీపీలో చేరాయి.

బొబ్బిలి/రూరల్, ఫిబ్రవరి 11 (ఆంధ్రజ్యోతి): బొబ్బిలి మండలం రాముడువలస గ్రామం ఎస్సీ కాలనీకి చెందిన 60 కుటుంబాలు వైసీపీని వీడి టీడీపీలో చేరాయి. బొబ్బిలి కోటలో మంగళవారం చింతాడ జయప్రదీప్, చింతాడ డేవిడ్ ఆధ్వర్యంలో వీరంతా ఎమ్మెల్యే బేబీనాయన సమక్షంలో టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. ఈసందర్భంగా బేబీనాయన వారిని పార్టీలోకి ఆహ్వానించారు.