Share News

కేసులో వ్యక్తికి 20 ఏళ్ల జైలు

ABN , Publish Date - Feb 26 , 2025 | 12:24 AM

పోక్సో కేసులో వ్యక్తికి 20 ఏళ్లు జైలు శిక్ష, రూ.4 వేలు జరిమానా విధిస్తూ పోక్సో ప్రత్యేక న్యాయాధికారి నాగమణి తీర్పు వెల్లడించారని ఎస్పీ వకుల్‌ జిందాల్‌ ఓ ప్రకటనలో తెలిపారు.

కేసులో వ్యక్తికి 20 ఏళ్ల జైలు

దత్తిరాజేరు, ఫిబ్రవరి 25 (ఆంధ్రజ్యోతి): పోక్సో కేసులో వ్యక్తికి 20 ఏళ్లు జైలు శిక్ష, రూ.4 వేలు జరిమానా విధిస్తూ పోక్సో ప్రత్యేక న్యాయాధికారి నాగమణి తీర్పు వెల్లడించారని ఎస్పీ వకుల్‌ జిందాల్‌ ఓ ప్రకటనలో తెలిపారు. మండలంలో ఓ గ్రామానికి చెందిన బాలిక గజపతినగరంలో ఒక ప్రైవేటు కళాశాలలో ఇంటర్‌ చదువుతోందన్నారు. బస్‌ పాస్‌ కోసం 2023 జూన్‌ 29న వెళ్లిన బాలిక ఇంటికి తిరిగి రాకపోవడంతో బాలిక అదృశ్యమైనట్టు తల్లి ఫి ర్యాదు మేరకు పెదమానాపురం పోలీసులు కేసు నమోదు చేశారన్నారు. మారోజు వెంకటేష్‌ ఆ గ్రామంలో ట్యూషన్‌ చెప్పేవాడని, ట్యూషన్‌కు వెళ్లే సమయంలో బాలిక తో పరిచయం పెంచుకున్న అతడు పెళ్లి చేసుకుంటానని నమ్మించి వేరే ప్రాంతానికి తీసుకువెళ్లి లైంగిక దాడికి పాల్పడ్డాడన్నారు. బాలిక తెలిపిన వివరాలతో పెదమానాపురం పోలీసులు పోక్సో కేసు నమోదు చేశా రన్నారు. అప్పటి డీఎస్పీ పి.శ్రీనివాసరావు దర్యాప్తు చేసి నిందితుడిని కోర్టులో హాజరుపరిచారన్నారు. తెలిపారు. నేరం రుజువు కావడంతో న్యాయాధికారి శిక్ష ఖరారు చేశారని ఎస్పీ వివరించారు.

Updated Date - Feb 26 , 2025 | 12:24 AM