Share News

పీజీఆర్‌ఎస్‌కు 121 అర్జీలు

ABN , Publish Date - Jan 07 , 2025 | 12:23 AM

కలెక్టర్‌ కార్యా లయ సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక(పీజీఆర్‌ఎస్‌)కు 121 అర్జీలు వచ్చాయి.

పీజీఆర్‌ఎస్‌కు 121 అర్జీలు

పార్వతీపురం, జనవరి 6 (ఆంధ్రజ్యోతి): కలెక్టర్‌ కార్యా లయ సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక(పీజీఆర్‌ఎస్‌)కు 121 అర్జీలు వచ్చాయి. ఈ కార్యక్రమంలో కలెక్టర్‌ శ్యాంప్రసాద్‌ తో పాటు జేసీ ఎస్‌ఎస్‌ శోభిక, సబ్‌ కలెక్టర్‌ అశుతోష్‌ శ్రీవాస్తవ, డీఆర్‌వో కె.హేమలత, కేఆర్‌ఆర్‌సీ ప్రత్యేక ఉప కలెక్టర్‌ పి.ధర్మచంద్రారెడ్డి భాగస్వాములై ప్రజల నుంచి అర్జీలను స్వీకరించారు. ఈసందర్భంగా కలెక్టర్‌ మాట్లాడు తూ అర్జీల పరిష్కారంపై అధికారులు ప్రత్యేక శ్రద్ధ పెట్టి బాధ్యతతో పనిచేసి త్వరితగతిన పరిష్కరించాలని ఆదేశిం చారు. గుమ్మలక్ష్మీపురం మండలం జోగిపురం, డొంగరికి క్కువ, కురపాం మండలం బొడ్డిగాడిగూడ గ్రామాలకు సరైన రోడ్డు సౌకర్యం కల్పించాలని ఆయా గ్రామస్థులు అర్జీలను అందజేశారు. గరుగుబిల్లి మండలం ఉల్లిభద్రలో ఉపాధి హామీ ఫీల్డ్‌ అసిస్టెంట్‌ను నియమించాలని ఆ గ్రామ ప్రజలు వినతిపత్రం అందించారు. ఇలా మరిన్ని అర్జీలను అందించారు. పలు అర్జీలకు సంబంధించి కలెక్టర్‌ స్వయంగా వివరాలు నమోదు చేసుకున్నారు.

గిరిజన సమస్యలు పరిష్కరించండి

సీతంపేట రూరల్‌, జనవరి 6(ఆంధ్ర జ్యోతి): గిరిజన గ్రామాల్లో నెలకొన్న సమస్యలను పరి ష్కరించాలని పలు గ్రామాలకు చెందిన గిరిజనులు ఐటీడీఏ ఏపీవో జి.చిన్నబాబును కోరారు. సోమవారం స్థానిక ఐటీడీఏ కార్యాలయంలోని ఎస్‌ఆర్‌ శంకరన్‌ సమావేశ మందిరంలో ఏపీవో జి.చిన్నబాబు ఆధ్వర్యంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక నిర్వహించారు. నూతన గృహం మంజూరు చేయాలని కె.బొంబడుగూడ గ్రామాని కి చెందిన సవర రాజయ్య కోరారు. ఎగువదారబ గ్రామం లో జీపీఎస్‌ పాఠశాల భవనం, తాగునీటి సౌకర్యం కల్పిం చాలని సవర భుజంగరావు కోరారు. ఉద్యోగవకాశం కల్పిం చాలని లబ్బ గ్రామానికి చెందిన జన్ని నాగేశ్వరరావు కోరా రు. ఇలా అనేక సమస్యలు పరిష్కారం కోరుతూ పీజీఆర్‌ ఎస్‌కు 22 వినతులు వచ్చాయి. గ్రీవెన్స్‌లో ఏపీవోతో పాటు డీడీ అన్నదొర, పీహెచ్‌వో వెంకటగణేష్‌, ఏఎంవో కోటిబా బు పలు శాఖలకు చెందిన అధికారులు పాల్గొన్నారు.

Updated Date - Jan 07 , 2025 | 12:23 AM