Vishwashanti Students Shine: ఇంటర్‌లో ఉయ్యూరు విశ్వశాంతి విజయకేతనం
ABN , Publish Date - Apr 13 , 2025 | 05:08 AM
ఉయ్యూరు విశ్వశాంతి ఎడ్యుకేషనల్ సొసైటీ విద్యార్థులు ఇంటర్ పరీక్షల్లో అద్భుత విజయాలు సాధించారు. ముఖ్యంగా, టి.హారిక 989 మార్కులతో జేఈఈ మెయిన్స్‌లో 99.93 శాతం మార్కులు సాధించారు

ఉయ్యూరు, ఏప్రిల్ 12(ఆంధ్రజ్యోతి): రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన మొదటి, రెండో సంవత్సరం ఇంటర్మీడియట్ పరీక్షా ఫలితాల్లో ఉయ్యూరులోని విశ్వశాంతి ఎడ్యుకేషనల్ సొసైటీ విద్యార్థులు విజయకేతనం ఎగురవేసినట్టు విద్యాసంస్థ ప్రతినిధులు శనివారం తెలిపారు. రెండవ సంవత్సరం ఎంపీసీలో తమ విద్యార్థిని టి.హారిక 989 మార్కులు సాధించిందని, ఈమె ఇటీవల జరిగిన జేఈఈ మెయిన్స్ ఫస్ట్ సెషన్స్‌లో 99.93 శాతం మార్కులు కైవసం చేసుకుందని పేర్కొన్నారు. వి.కృష్ణప్రసాద్ 986 మార్కులు, కె.సాగర్‌బాబు, సొంఠి గుణశ్రీ, ఈ.ఆదిత్య రామ్ 985 మార్కులు సాధించినట్టు తెలిపారు. ఎంపీసీలో 36మంది విద్యార్ధులు 975 మార్కులకు పైగా సాధించారని వెల్లడించారు. బైపీసీలో సి.హెచ్.ప్రణీత 984 మార్కులు, బి.త్రిలోక్య 980 మార్కులు సాధించినట్టు తెలిపారు. ఈ గ్రూపులో 12మంది విద్యార్థులు 975 పైగా మార్కులు సాధించారని పేర్కొన్నారు. అత్యుత్తమ మార్కులు సాధించిన విద్యార్థినీ, విద్యార్థులను విశ్వశాంతి చైర్మన్ మాదాల సుబ్రహ్మణ్యేశ్వరరావు, అకడమిక్ డైరెక్టర్ మాదాల సూర్యశేఖర్ ప్రత్యేకంగా అభినందించారు.