Share News

Biodiversity Park : ఇది నాన్‌వెజ్‌ మొక్క!

ABN , Publish Date - Feb 19 , 2025 | 05:36 AM

శాస్ర్తీయ నామం నెపెంతెస్‌. దీనికి కీటకాహా ర మొక్క, నాన్‌వెజ్‌ మొక్క, ఆకలి మొక్క అన్న పేర్లు కూ డా ఉన్నాయి. ఈ మొక్క ఆకు చివరి భాగంలో బ్లాడర్‌ (సంచి) మాదిరిగా ఉంటుంది.

Biodiversity Park : ఇది నాన్‌వెజ్‌ మొక్క!

ABN AndhraJyothy : విభిన్న జాతుల మొక్కలకు విశాఖపట్నంలోని జీవ వైవిధ్య ఉద్యానవనం నిలయంగా మారింది. ఇక్కడ ఒక అరు దైన మొక్క అందరినీ ఆకట్టుకుంటోంది. దాని పేరు పిక్చర్‌ ప్లాంట్‌. శాస్ర్తీయ నామం నెపెంతెస్‌. దీనికి కీటకాహా ర మొక్క, నాన్‌వెజ్‌ మొక్క, ఆకలి మొక్క అన్న పేర్లు కూ డా ఉన్నాయి. ఈ మొక్క ఆకు చివరి భాగంలో బ్లాడర్‌ (సంచి) మాదిరిగా ఉంటుంది. దాని అంచు చివరన మకరందాన్ని స్రవిస్తుంది. ఆ మకరందం కోసం పురుగులు, చీమలు, క్షీరదాలు బ్లాడర్‌ వద్దకు చేరి అందులో దిగుతుంటాయి. బ్లాడర్‌ జిగురుగా ఉండడం వల్ల పైకి రాలేక అందులోనే చనిపోతాయి. పిక్చర్‌ ప్లాంటు... ఆ పురుగులను జీర్ణం చేసుకుని అవసరమైన ప్రోటీన్లను ఉత్పత్తి చేసుకుని ఎదుగుతుంది. సాధారణంగా మేఘాలయ, అసోం వంటి ప్రాంతాల్లో పెరిగే ఈ మొక్కను... సూర్యరశ్మికి దూరంగా పెంచుతున్నారు ఉద్యానవన నిర్వాహకులు ఎం.రామమూర్తి, మంగతాయి దంపతులు.

- విశాఖపట్నం, ఆంధ్రజ్యోతి

Updated Date - Feb 19 , 2025 | 05:36 AM