Share News

రాష్ట్రాన్ని నిండా ముంచిన వైసీపీ

ABN , Publish Date - Jan 30 , 2025 | 11:28 PM

గత ఐదేళ్ల వైసీపీ పాలనలో రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో నిండా ముంచిందని టీడీపీ అరకు పార్లమెంటరీ అధ్యక్షుడు, జీసీసీ చైర్మన్‌ కిడారి శ్రావణ్‌కుమార్‌ ధ్వజమెత్తారు.

రాష్ట్రాన్ని నిండా ముంచిన వైసీపీ
పాడేరులో విలేకరులతో మాట్లాడుతున్న జీసీసీ చైౖర్మన్‌ శ్రావణ్‌కుమార్‌

జీసీసీ చైర్మన్‌ కిడారి శ్రావణ్‌కుమార్‌ ధ్వజం

పాడేరు, జనవరి 30(ఆంధ్రజ్యోతి): గత ఐదేళ్ల వైసీపీ పాలనలో రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో నిండా ముంచిందని టీడీపీ అరకు పార్లమెంటరీ అధ్యక్షుడు, జీసీసీ చైర్మన్‌ కిడారి శ్రావణ్‌కుమార్‌ ధ్వజమెత్తారు. గురువారం పాడేరులో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టేసిన వైఎస్‌.జగన్‌.. పేదలకు అంత చేశాం, ఇంత చేశామని చెప్పుకోవడం విడ్డూరంగా ఉందన్నారు. వైసీపీ ప్రభుత్వం చేసిన అప్పుల సమస్యలను ప్రస్తుత కూటమి ప్రభుత్వం ఒక్కొక్కటిగా పరిష్కరించుకుంటూ వస్తుందన్నారు. కేవలం ఏడు నెలల్లోనే వందల కోట్ల అప్పులను తీర్చడంతో పాటు రాష్ట్రాన్ని గాడిన పెట్టిన ఘనత సీఎం చంద్రబాబునాయుడుకు దక్కుతుందన్నారు. వైసీపీ పాలనలో కేవలం జగన్‌, ఆయన కోటరీ విలాసాలు, స్కామ్‌లకే ప్రాధాన్యం ఇచ్చారని, ప్రజల సంక్షేమం, అభివృద్ధిని గాలికి వదిలేశారని ఆరోపించారు. కానీ కూటమి ప్రభుత్వం అభివృద్ధి పనులకు పోటీగానే సంక్షేమ పథకాలను అమలు చేస్తుందన్నారు. ఈ సమావేశంలో జీసీసీ డైరెక్టర్‌ బొర్రా నాగరాజు, టీడీపీ నేతలు పాండురంగస్వామి, బాకూరు వెంకటరమణరాజు, కొమ్మ రమ, తిరుపతిరావు, మురళి, సూర్యాకాంతం, అచ్చిబాబు, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Jan 30 , 2025 | 11:28 PM