తప్పని డోలీ మోతలు
ABN , Publish Date - Feb 07 , 2025 | 10:27 PM
మండలంలోని గిరిజనులకు డోలీ మోతలు తప్పడం లేదు. రోడ్డు సౌకర్యం లేకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

గర్భిణి, జ్వర బాధితుడికి డోలిపై తరలింపు
అనంతగిరి, ఫిబ్రవరి 7 (ఆంధ్రజ్యోతి): మండలంలోని గిరిజనులకు డోలీ మోతలు తప్పడం లేదు. రోడ్డు సౌకర్యం లేకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మండలంలోని మారుమూల పినకోట పంచాయతీ రాచకీలం గ్రామానికి చెందిన గెమ్మెలి సింహాచలం(65) జ్వరంతో బాధపడుతున్నాడు. గ్రామంలోని ఇటీవలే వైద్య సిబ్బంది సేవలందించినప్పటికి జ్వరం తగ్గకపోవడంతో కుటుంబ సభ్యులు డోలీమోతపై మూడు కిలోమీటర్లు గుమ్మంతి వరకు మోసుకొచ్చారు. అదేగ్రామానికి చెందిన సూకురు దేముడమ్మ 8 నెలల గర్భిణి, ప్రతి నెల తనిఖీలు నిమిత్తం పినకోట పీహెచ్‌సీ తరలించాలి. అయితే శుక్రవారం గర్భిణిని మూడు కిలోమీటర్లు డోలీమోతపై కుటుంబ సభ్యులు గుమ్మంతి వరకు మోసుకువచ్చారు. అక్కడి నుంచి ఆటోలో పినకోట పీహెచ్‌సీకి ఇద్దరిని తరలించారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి, రోడ్డు పనులు ప్రారంభించాలని గిరిజనులు కోరుతున్నారు.